Share News

Kumaram Bheem Asifabad: జిల్లాలో చల్లబడిన వాతావరణం

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:51 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 8: జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరి తలద్రోణి కారణంగా జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నిన్నటివరకు 43డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు 39డిగ్రీలకు తగ్గాయి.

 Kumaram Bheem Asifabad:   జిల్లాలో చల్లబడిన వాతావరణం

- పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 8: జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరి తలద్రోణి కారణంగా జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నిన్నటివరకు 43డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు 39డిగ్రీలకు తగ్గాయి. దీంతో ప్రజలు కొంతఉపశమనం పొందారు. జిల్లా వ్యాప్తంగా 1.3మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. సిర్పూర్‌(యు) మండలంలో 0.6మిల్లీమీటర్లు, లింగాపూర్‌3మిల్లీమీటర్లు, ఆసిఫాబాద్‌లో5.2మిల్లీమీటర్లు,కెరమెరిలో 2.4మిల్లీమీటర్లు, వాంకిడిలో 1.0మిల్లీమీటర్లు, కాగజ్‌నగర్‌లో 1.2మిల్లీమీటర్లు, సిర్పూర్‌(టి)లో 3.6మిల్లీ మీటర్లు, కౌటాలలో 1.2మిల్లీమీటర్లు, పెంచికలపేటలో 1.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

లింగాపూర్‌లో గాలివాన

లింగాపూర్‌: మండ లంలో ఆదివారం రాత్రి అక్క డక్కడ గాలివానతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలకేంద్రంతోపాటు గోపాల్‌పూర్‌ తండా, మామి డిపల్లి, పిక్లతండా గ్రామాల్లో రైతులు జాటోత్‌ సుధాకర్‌, జాదవ్‌ గణేష్‌ రైతుల జొన్నపంట నేలవాలింది. ఒక్కొక్క రైతుకు ఐదు ఎకరాల్లో పంట నష్టం కలిగిందని తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 10:51 PM