Share News

Kumaram Bheem Asifabad: కూల్‌ కూల్‌గా.. కూలర్లు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:39 PM

వాంకిడి, ఏప్రిల్‌ 7: ఎండాకాలం అనగానే మనందరకీ గుర్తొచ్చేవి కూలర్లే.. ఎండనుంచి ఉపశమనానికి, వేసవితాపం నుంచి రక్షణకు ప్రతిఇంట్లో కూలర్‌లు దర్శనమిస్తుంటాయి.

Kumaram Bheem Asifabad: కూల్‌ కూల్‌గా.. కూలర్లు

- ప్రారంభమైన కూలర్ల సందడి

- వేసవి నుంచి రక్షణకు ఎంతో ఉపయోగం

- ముమ్మరంగా కూలర్‌ల విక్రయాలు

వాంకిడి, ఏప్రిల్‌ 7: ఎండాకాలం అనగానే మనందరకీ గుర్తొచ్చేవి కూలర్లే.. ఎండనుంచి ఉపశమనానికి, వేసవితాపం నుంచి రక్షణకు ప్రతిఇంట్లో కూలర్‌లు దర్శనమిస్తుంటాయి. వేసవికాలం ప్రారంభం కావడంతో మండలంలో కూల ర్ల విక్రయాలు ఉపందుకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్ర తలకు ప్రజలు ఇబ్బందులకు గుర వుతున్నారు. భానుడి ప్రతాపానికి ఉక్కపోతనుంచి రక్షణ పొందేం దుకు ప్రజలు కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మండలంలోని పలు ఎలక్ట్రికల్‌ దుకాణాల్లో ఇప్పటికే వ్యాపారులు కూలర్లను అందుబాటులో ఉంచారు. వీటి ధర నాణ్యతను బట్టి రూ.2000నుంచి రూ. 6వేల వరకు నిర్ణయిస్తున్నారు. ఫైబర్‌, ఇనుప కూలర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కుమరం భీం జిల్లా రెబ్బెన, మంచిర్యాల జిల్లా కేంద్రంతోపాటు మహారాష్ట్రలోని చంద్రపూర్‌ నుంచి కూలర్లను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. సీజన్‌లో సుమారు ఒక్కో దుకాణంలో రెండు వందల కూలర్లకు పైగా అమ్ముడవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మండలకేంద్రంలోని ప్రజలతో పాటు మారుమూల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూలర్లను కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు పేర్కొంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కట్నకానుకల జాబితాలోను కూలర్‌లు చేరడంతో వేసవికాలంలో కూలర్‌లకు డిమాండ్‌ అధికంగా ఉంటుందని తెలుపుతున్నారు. టేబుల్‌పై ఉంచుకునే పర్సనల్‌ కూలర్‌తోపాటు పెళ్లిళ్లు సందర్భంగా ఫంక్షన్‌హాళ్లలో, హోటళ్లలో వినియోగించే జంబో కూలర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కూలర్‌ల విక్రయాలతోపాటు పాత మరమతులు కూడా చేస్తున్నారు.

-అందుబాటు ధరలో..

- సైఫ్‌ఖాన్‌, వ్యాపారస్తుడు

ప్రతిసంవత్సరం ఎండా కాలంలో రెండు వంద లకు పైగా కూలర్లు విక్రయిస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల నుంచి కొనుగోలు కోసం వచ్చే ప్రజలకు అధికధరలకు విక్రయించకుండా సరసమైన ధరలకు కూలర్లను విక్రయిస్తాను. కొత్త ఐరన్‌, ఫైబర్‌ కూలర్లతో పాటు పాత కూలర్లకు గడ్డి, ఇతర ముడిసరకులు వేసి మరమత్తులు చేసి ఇస్తుంటాము. మండల ప్రజల ఆర్థికస్థోమతను బట్టి కూలర్‌ల విక్రయాలు జగుతుంటాయి.

Updated Date - Apr 07 , 2024 | 10:39 PM