Kumaram Bheem Asifabad: గ్రంథాలయ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Mar 06 , 2024 | 09:45 PM
ఆసిఫాబాద్, మార్చి 6: జిల్లాకేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయశాఖ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ వెంకటేష్ దౌత్రె అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో రూ.1.50కోట్లతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను డీఈ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు.

- కలెక్టర్ వెంటేష్ దౌత్రె
ఆసిఫాబాద్, మార్చి 6: జిల్లాకేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయశాఖ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ వెంకటేష్ దౌత్రె అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో రూ.1.50కోట్లతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను డీఈ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ శాఖ నూతన భవన పనులను వారం రోజుల్లోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్,ఏఈ కిరణ్,లైబ్రెరియన్ సదానందం, కాంట్రాక్టర్ అమర్‌బీన్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
విద్యాసంవత్సరా(2024-25)నికి గాను రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ఉత్తర్వుల మేరకు హైదరాబా ద్‌లోని బేగంపేట్, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతి లో ప్రవేవానికి అర్హులైన గిరిజనవిద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు కలెక్టర్ వెంకటేష్‌దౌత్రె ఒక ప్రకటనలో తెలి పారు. గోండు, నాయక్‌పోడ్, పర్దాన్‌లకు3, కోలాం, ఆంద్‌లకు 1, లంబాడ1, ఇతర గిరిజనులకు 1మొత్తం 6సీట్ల ద్వారా ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈనెల 14నడ్రాతీస్తామన్నారు.