Share News

Kumaram Bheem Asifabad: కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే హరీష్‌బాబు

ABN , Publish Date - May 03 , 2024 | 11:05 PM

పెంచికలపేట, మే 3: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాటలను వక్రీకరించి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. శుక్ర వారం మండలంలోని బొంబా యిగూడ, పోతెపల్లి, చెడ్వాయి, దర్గపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.

Kumaram Bheem Asifabad:  కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే హరీష్‌బాబు

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

పెంచికలపేట, మే 3: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాటలను వక్రీకరించి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. శుక్ర వారం మండలంలోని బొంబా యిగూడ, పోతెపల్లి, చెడ్వాయి, దర్గపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆదిలాబాద్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలులో ప్రజలకు మొండిచేయి చూపిందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పోరాడుతుందని దానికి నిదర్శణమే అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణమన్నారు. పెంచికలపేట పెద్దవాగుపై రెండో వంతెన నిర్మించి ఎల్కపల్లి, లగ్గాం వరకు అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తామని ఆయనహామీ ఇచ్చారు. ఎర్రగుంట గ్రామానికి రూ.1.50కోట్లతో లో లెవల్‌ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ, మధుకర్‌, మహేష్‌, నాగేష్‌, పెంటయ్య, భీమయ్య, కాంతారావు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే హరీష్‌బాబు ఇంటింటి ప్రచారం

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ వార్డు నెం.1లో శుక్రవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ను అధికమెజార్టీతో గెల్పించాలన్నారు. బీజేపీ అభ్యర్థిని గెల్పిస్తే సిర్పూరు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట కార్యకర్తలు, నాయకులున్నారు.

బీజేపీలో పలువురికి చేరిక

కాగజ్‌నగర్‌ టౌన్‌: పోతపల్లి గ్రామానికి చెందిన కొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి అంతా కృషి చేయాలన్నారు. త్వరలో జరిగే ఎంపీఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ను అధిక మెజార్టీతో గెల్పించాలని కోరారు.

Updated Date - May 03 , 2024 | 11:05 PM