Share News

Kumaram Bheem Asifabad: ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లపై ఫిర్యాదు

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి 22: ఆదర్శ పాఠశాల పేరులోనే ఆదర్శం కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న రెండు పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు దీర్ఘకాలంగా తిష్టవేయడంతో అవినీతి పేరు కుపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతు న్నాయి.

Kumaram Bheem Asifabad:  ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లపై ఫిర్యాదు

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి 22: ఆదర్శ పాఠశాల పేరులోనే ఆదర్శం కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న రెండు పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు దీర్ఘకాలంగా తిష్టవేయడంతో అవినీతి పేరు కుపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతు న్నాయి. దీనిపై ఆదర్శ పాఠశాలల రాష్ట్ర అదనపు డైరెక్టర్‌కు ప్రిన్సిపాళ్ల అవినీతిపై జిల్లాలోని ఆదివాసీ సంక్షేమపరిషత్‌ ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది.

జిల్లాలో రెండు ఆదర్శపాఠశాలలు ఉన్నాయి. ఒకటి జిల్లా కేంద్రంలో ఉండగా మరొకటి సిర్పూర్‌(యు) మండలకేంద్రంలో ఉంది. పాఠశాలల రాష్ట్ర అదనపు డైరెక్టర్‌కు జిల్లాలోని ప్రిన్సిపాల్స్‌ అవినీతిపై ఎండ గడుతూ ఎనిమిది పేజీల ఫిర్యాదు అంద జేశారు. దీనిలో హాజరు కాని రోజుకు కూడా జీతాల బిల్లు చేయడం, పాఠశాలకు రాకుండా జీతం తీసుకోవడం, అడ్మి షన్లకు రూ.5వేల రూపాయలకు వరకు డబ్బు వసూలు చేయ డం, మధ్యాహ్న భోజ నంలో తప్పుడు బిల్లులు ఇవ్వడం, ఉపా ధ్యాయులు వారానికి రెండు మూడు రోజులు హాజరుకావడం, రిపేర్లపేరుతో దొంగబిల్లులు లాంటి అంశాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుం టారో వేచి చూడాలి.

Updated Date - Mar 22 , 2024 | 10:23 PM