Kumaram Bheem Asifabad: : పిల్లలు బడిలో చేరేలా..
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:41 PM
వాంకిడి, జూన్ 7: పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రమాదంలో పడింది.

- ప్రారంభమైన బడిబాట ప్రత్యేక కార్యక్రమాలు
- ప్రభుత్వ విద్యా బలోపేతానికి చర్యలు
- గ్రామాల్లో ఉపాధ్యాయుల ప్రచారం
- ప్రభుత్వపాఠశాలల్లో విద్యాబోధనలపై అవగాహన
- 19వతేదీ వరకు రోజుకో ప్రత్యేక కార్యక్రమం
- విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం
వాంకిడి, జూన్ 7: పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యావ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలను కాపాడు కోవడం విద్యాశాఖకు కత్తిమీద సాములామారింది. అందుకని ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులను ఆకర్శించడం కోసం ప్రభుత్వం ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ 6నుంచి 19వరకు ఉపాధ్యాయులు రోజుకో కార్యక్రమంతో విద్యార్థులు వారి తలిదండ్రులను కలవనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మధ్యాహ్నభోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయులు ప్రతిగ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మధ్యలో చదువుమానేసిన వారిని, బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేం దుకు కృషి చేయనున్నారు. దీంతోపాటు అయిదేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచలాన్న లక్ష్యంతో ప్రత్యే కార్యాచరణ రూపొందించుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
- విస్తృత ప్రచారానికి సన్నాహాలు..
కొన్నేళ్లుగా విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం చేపడు తున్నా సత్ఫలితాలు రావడంలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల సమన్వయంతో పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు చేరివీటిని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు.
- రోజువారి కార్యక్రమాలు ఇలా..
ఫ 3నుంచి 9వతేదీవరకు గ్రామాలు, ఆవాసప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం
ఫ 12న మనఊరు మనబడి, మనబస్తీ మనబడి కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలను మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాలి.
ఫ 6 నుంచి 11వ తేదీ వరకు ఉడయం 7నుంచి 11గంటల వరకు ప్రతిరోజూ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవడం.
ఫ 6వ తేదీన గ్రామస్థాయి డ్రైవ్ చేపట్టి స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ర్యాలీలు నిర్వహించాలి.
ఫ7వ తేదీన ప్రతిఇంటికి వెళ్లి పాఠశాలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి.
ఫ 8నుంచి 10వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతులపట్ల అవగాహన కలిగించి నమోదు చేయిం చాలి.
ఫ 11న గ్రామసభల ఏర్పాటు చేయాలి
ఫ 12న విద్యార్థులకు స్వాగతదినోత్సం ఏర్పాటు చేసి పాఠశాలలను అందంగా పండుగ వాతావరణలో అలంకరించి రంగోలి తదితర ఉత్సవ కార్యక్రమాలు రూపొం దించాలి. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారాపాఠశాలల్లో చేపట్టిన వసతులను వివరించి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలి. గత విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరిచిన, మంచి హాజరు కలిగిన విద్యార్థులను పోత్సహించిన వారి తల్లిదండ్రులను సన్మానించాలి.
ఫ 13న తరగతి వారిగా విద్యార్థులు తయారు చేసిన విద్యాప్రమాణాలకు సంబంధించి పోస్టర్లను, చార్ట్స్ ప్రదర్శించి తరగతి గదులను అలంక రించాలి.
ఫ 14న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలను భాగస్వామ్యం చేసి పండుగ వాతావరణంలో నిర్వహించాలి. ఉన్నతపాఠశాలల్లో విద్యయొక్క ప్రాము ఖ్యత, పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులతో ప్రదర్శించాలి.
ఫ 15 బాలికల విద్యాదినోత్సవం జరుపుకోవాలి. బడిబాట కార్యక్రమంలో గుర్తించిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను భవిత కేంద్రాల్లో, పాఠశాలల్లో చేర్పించాలి.
ఫ 18న డిజిటల్ తరగతులపై అవగాహన కార్యకమాలు, తరగతి వారీగా విద్యా ర్థులతో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన విషయాన్ని ఇంటింటా చదువుల పంట అనేయాప్ గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలి.
ఫ 19న క్రీడా దినోత్సవం ఏర్పాటు చేసి విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, ఆటల పోటీలు నర్వహించాలి.
- ముమ్మరంగా బడిబాట కార్యక్రమం..
వాంకిడి మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాల్లో మద్యలో బడిమానేసిన విద్యార్థులను, బాలకార్మికులను ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయులు గుర్తించారు. విద్యార్థు లను వ్యవసాయ కూలీ పనులకు తీసుకువెళ్లకుండా పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సంక్షేమపథకాలను ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి దండ్రులకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీ దుర్గం సందీప్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
- పకడ్బందీగా బడిబాట కార్యక్రమం
- ఎంఈవో మనుకుమార్
ఈనెల 6నుంచి నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం పకడ్బందీగా చేపట్టనున్నాము. ప్రతిగ్రామానికి ఉపాధ్యాయులు వెళ్లి మధ్యలో బడిమానేసిన, బాలకార్మికులను గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాము. ఈనెల 19వరకు చేపట్టాల్సిన బడిబాట కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేసేలా అన్నివిధాల కృషి చేస్తున్నాం.