Share News

Kumaram Bheem Asifabad: నాగమ్మ చెరువులో కోళ్ల వ్యర్థాలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:44 PM

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 19: మండల కేంద్రంలోని చికెన్‌సెంటర్ల వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను సంచుల్లో నింపి నాగమ్మ చెరు వులో పడవేస్తున్నారు. దీంతో నాగమ్మ చెరు వులోని బుద్ధుడి విగ్రహం సందర్శణకు వచ్చే వారు, సమీపంలోని మసీదుకు, వారసంత వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు.

Kumaram Bheem Asifabad:  నాగమ్మ చెరువులో కోళ్ల వ్యర్థాలు

- ఇబ్బందులు పడుతున్న సందర్శకులు, ప్రజలు

- డంపింగ్‌ యార్డు నిర్మించినా వినియోగించని వైనం

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 19: మండల కేంద్రంలోని చికెన్‌సెంటర్ల వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను సంచుల్లో నింపి నాగమ్మ చెరు వులో పడవేస్తున్నారు. దీంతో నాగమ్మ చెరు వులోని బుద్ధుడి విగ్రహం సందర్శణకు వచ్చే వారు, సమీపంలోని మసీదుకు, వారసంత వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు కుళ్లిపోయిన కోళ్ల వ్యర్థాలను కుక్కలు, పందులు తిని చనిపోతున్నాయి. ఈ విష యాన్ని గ్రామ పంచాయతీ అధికారులకు, ప్రత్యేకాధికారులకు తెలిపినప్పటికీ పట్టించు కోవడం లేదని మండలవాసులు ఆరోపిస్తున్నారు. చికెన్‌సెంటర్‌ యజమానులకు ఊరి బయట ఈజీఎస్‌ పథకంలో డంపింగ్‌ యార్డు నిర్మించి ఇచ్చినప్పటికీ ఆ యార్డులో వ్యర్థాలను పడేయ కుండా మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో పడేస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:44 PM