Share News

Kumaram Bheem Asifabad: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: ఐటీడీఏ పీవో

ABN , Publish Date - May 30 , 2024 | 10:58 PM

ఆసిఫాబాద్‌, మే 30: ఆసుపత్రికివచ్చే రోగు లకు మెరుగైనవైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు.

 Kumaram Bheem Asifabad: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: ఐటీడీఏ పీవో

- ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

ఆసిఫాబాద్‌, మే 30: ఆసుపత్రికివచ్చే రోగు లకు మెరుగైనవైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. అడ గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఓపీ వివరాలు, మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. గర్భిణులకు అందుతున్న వైద్య సేవ లపై ఆరా తీశారు. ఆసుపత్రిలో కాన్పులు, రికార్డుల నిర్వహణ అంశాలపై ఆరోగ్యసిబ్బంది అప్రమత్తంగా ఉండా లని సూచించారు. ఔషదగిడ్డంగిలో అన్ని రకాలమందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎండతీవ్రత దృష్ట్యా వడదెబ్బతో వచ్చే రోగులకు ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వ్యాధి గ్రస్తులకు మెరుగైనచికిత్స అందించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాము కాటు సంబంధిత వ్యాక్సిన్‌ మందులస్టాక్‌ వివరాలు తెలుసు కున్నారు. రానున్న వర్షాకాలంలో పాముకాటు సంఘటనలు ఉండే అవకావం ఉన్నం దున అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రం ఆవరణలో ఎలాంటి చెత్త పేరుకుపోకుండా చూడాలని, ఎప్పటికప్పుడు శాని టేషన్‌ చేస్తుండాలని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు, ఏఎన్‌ ఎంలు ఎలాంటి అనుమతులు లేకుండా మూడురోజులుగా విధులకు హాజరు కానందుకు అలాగే అటెండెన్స్‌ రిజిస్టర్‌ సెలవురికార్డు సరిగ్గా నిర్వహించ నందుకుగాను పీహెచ్‌సీ వైద్యాధికారికి షోకాజు నోటీసు ఇవ్వాల్సిందిగా అధికా రులను ఆదేశించారు. ఆమెవెంట స్టాఫ్‌నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 30 , 2024 | 10:58 PM