Kumaram Bheem Asifabad: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
ABN , Publish Date - Aug 21 , 2024 | 10:29 PM
బెజ్జూరు, ఆగస్టు 21: పేదప్రజలకు మెరుగైనవైద్యం అందిం చాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని బారెగూడెం, పోతెపల్లి, బెజ్జూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
బెజ్జూరు, ఆగస్టు 21: పేదప్రజలకు మెరుగైనవైద్యం అందిం చాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని బారెగూడెం, పోతెపల్లి, బెజ్జూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. బెజ్జూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను పరిశీలిం చారు. పేదప్రజలకు మెరుగైనవైద్యం అందించే విధంగా చూడాలని జిల్లా వైద్యాధికారి తుకారాంను ఆదేశించారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని త్వరలో ఖాళీలను భర్తీచేస్తామని తెలిపారు. బెజ్జూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసున్నారు. రోగులను వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగ్యూ కేసులు న్నాయని, ఒళ్లు నొప్పులతో పేషెంట్లు బాధపడుతు న్నట్లు రికార్డులో చూసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో రోడ్లపై గుంతలను పూడ్చి వేయించాలని బెజ్జూరు ప్రత్యేకాధికారిని ఆదేశించారు. సహకార బ్యాంకుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఈ సందర్భంగా గ్రామ స్థులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకారాంభట్, సీఈవో లక్ష్మినారాయణ, మండల ప్రత్యేకాధికారి వెంకటేష్, ఎంపీడీవో గౌరిశంకర్, డాక్టర్ అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా చూడాలి..
చింతలమానేపల్లి: ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని డబ్బా-బారెగూడ గ్రామాల్లో రోడ్లు, అమ్మఆదర్శ పాఠ శాలను పర్యవేక్షించారు. డబ్బా గ్రామంలో బారెగూడ గ్రామానికి రోడ్డు పూర్తిగా బురద మయంగా ఉందని గ్రామస్థులు కలెక్టర్‌కు చెప్పగా ఆయన వెంటనే రోడ్డు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికా రులను ఆదేశించారు. అక్కడి నుంచి ప్రైమరీస్కూల్ దగ్గర చేపట్టిన అమ్మ ఆదర్శపాఠశాల పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనవెంట తహసీల్దార్ మునావర్ షరీఫ్, డీటీ మస్కూర్ అలీ, ఎంపీడీఓ ప్రసాద్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులున్నారు.
నిరసన..:
మండలం డబ్బా గ్రామంలో పర్యటిం చిన కలెక్టర్ తిరిగి బెజ్జూరుకు వెళ్తున్న క్రమంలో మాలమహానాడు నాయకులు కలెక్టర్ వాహనం రాగానే రోడ్డుపై బైఠా యించారు. ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.