Kumaram Bheem Asifabad: పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ABN , Publish Date - May 12 , 2024 | 11:14 PM
ఆసిఫాబాద్, మే 12: లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సోమవారం జరగనున్న పోలింగ్ కార్యక్రమానికి సంబంధించి ప్రతిఅంశంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మే 12: లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సోమవారం జరగనున్న పోలింగ్ కార్యక్రమానికి సంబంధించి ప్రతిఅంశంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆది వారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో పోలింగ్ నమోదు, సమాచారాన్ని సేకరించి ఆన్ లైన్‌లో నమోదు చేసే ప్రక్రియపై కంప్యూటర్ ఆపరేటర్లు, అధికా రులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కార్యక్రమంలో ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ శాతాన్ని సెక్టార్ అధి కారుల వద్ద నుంచి ప్రతి రెండు గంటలకు నమోదైన ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు. నియోజకవర్గానికి ఒక జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒక ఆపరే టర్ 3/4సెక్టార్ అధికారుల నుంచి పోలింగ్ శాతాన్ని సేకరించాలన్నారు.
పోలింగ్ రోజు ఉదయం 9నుంచి 11 గంటలకు, మధ్యాహ్నం 1నుంచి 3గంటలకు, 4గంటలకు వివరాలు సేకరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇన్ చార్జిలుగా వ్యవహరించే జిల్లాస్థాయి అధి కారులు ఈప్రక్రియను పర్యవే క్షించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారి అనీల్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి, ఎన్నికల విభాగం తహసీల్దార్ మధుకర్, ఈ-డిస్ట్రిక్ మేనేజర్ గౌతంరాజ్, నాయబ్ తహసీల్దార్ జితేందర్, ఎన్‌ఐసీ ఇన్‌చార్జి శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.