Share News

Kumaram Bheem Asifabad: సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:44 PM

ఆసిఫాబాద్‌, జూన్‌ 12: వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులతో అధికారులు అప్ర మత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు.

 Kumaram Bheem Asifabad:  సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌, జూన్‌ 12: వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులతో అధికారులు అప్ర మత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అదనపుకలెక్టర్లు దీపక్‌ తివారి, వేణు, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ దండెవిఠల్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబుతో కలిసి జిల్లాలోని అన్నిశాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఈసందర్భంగా అమె మాట్లా డుతూ ప్రజాప్రతినిదులు, అధికారులు సమ న్వయంతో పనిచేసి జిల్లా అభివృద్దికి పాటుప డాలన్నారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయ మన్నారు. ఎన్నిక లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించ డంలో అధికారుల కృషి ప్రశంసనీయమ న్నారు. అదేవిధంగా రాబోయే మూడునెలలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో వర్షాకాలం అంటువ్యాధులు సోక కుండా జాగ్రత్త వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా దృష్టి సారించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున క్లోరినేషన్‌, శాని టేషన్‌ పై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. పాఠశా లలు పునఃప్రారంభమైనందున వసతి గృహాలు,పాఠశాలలను పరిశుభ్రంగా ఉండేలా అధికారులు దృష్టిసారించి కిందిస్థాయి అధికా రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ముంపు గ్రామాలపట్ల అప్రమత్తంగా ఉండా లని సర్పంచులు లేనందున ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న అధికారులే ప్రత్యేకచొరవ తీసుకోవాలన్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఎంహెచ్‌వో తుకారాం మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక అల వెన్సులు చెల్లించే విధంగా సీఎంను కోరతా మన్నారు. నకిలీ విత్తనాలను అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా వారిపై చర్యలు తీసు కోవాలని అవసరమైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని జిల్లావ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌రావును అదేశించారు. జిల్లాలో చిన్నచిన్న వాగులు, వంకలపై ఐరన్‌ వంతె నల నిర్మాణాలపై ఇంజనీరింగ్‌శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇలాంటి వంతెనలను ములుగు జిల్లాలో ప్రయోగాత్మ కంగా ఏర్పాటు చేశామన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆదిశగా దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పోడు భూముల విషయంలో అటవీ అధికారులు పాత భూముల జోలికి వెళ్లవద్దని సూచించారు. అధికారులు ఆసిఫాబాద్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లా అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి అధిక నిధులు కేటాయిస్తామని ఆమె పేర్కొన్నారు.

అనంతరం ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ ఎమ్మె ల్యేలు మాట్లాడుతూ జిల్లాలో మనఊరు మనబడి పనులు చేపట్టినా నేటికి బిల్లులు రాలేదని పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నప్పటికి సీజేరియన్‌ అపరేషన్లు నిర్వహించడంలేదని, ప్రైవేటు అంబులెన్స్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 10:44 PM