Share News

Kumaram Bheem Asifabad: డెంగ్యూ జ్వరాలతో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 16 , 2024 | 10:47 PM

వాంకిడి, మే 16: డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి ఉత్త రేణి సూచించారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది తో ర్యాలీ నిర్వహించారు.

 Kumaram Bheem Asifabad: డెంగ్యూ జ్వరాలతో అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి, మే 16: డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి ఉత్త రేణి సూచించారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ డెంగ్యూ వ్యాధి ఏడీస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కుట్టడం ద్వారా వస్తుందన్నారు. ఇది కుట్టిన ప్పుడు జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం, వికారం, వాంతులు వచ్చి నట్లుగా అనిపించడం, వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంటివద్ద డబ్బాలలో, పాతటైర్లలో, పూలకుండీ లలో, కవర్లలో, మురికి కుంటలలో నీరు నిలువకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో రవిదాస్‌, పీహెచ్‌ ఎన్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు: మండలకేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ అవినాష్‌ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంపై మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించారు. జాగ్రత్తలు పాటించినట్ల యితే డెంగ్యూ బారిన పడకుండా ఉంటామన్నారు. గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో మురికినీరు నిలువలేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు శుభ్ర పరిచినట్లయితే దోమలు వ్యాప్తిలేకుండా ఉంటుం దన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌ కమల, ఎల్‌టీ దిలీప్‌, స్టాఫ్‌ నర్సు కృప, విజ య, ఫార్మసిస్టు అయేషా, ఏఎన్‌ఎంలు సుస్మిత, మేఘన, మంజూల, సునీత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండలకేంద్రంలో పీహెచ్‌సీలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ లకు డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. దోమలు వ్యాప్తి చెందకుండా చ్యలు చేపట్టాలని, పరిస రాల పరిశుభ్రత పాటించాలని, పగటిపూట దోమలు కుట్టడం వల్ల డెంగ్యూవ్యాధి వస్తుందన్నారు. కార్యక్ర మంలో వైద్యాధికారిణి స్పందన, సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 10:47 PM