Share News

Kumaram Bheem Asifabad: మండలాల్లో బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:26 PM

వాంకిడి/బెజ్జూరు/సిర్పూర్‌(టి)/జైనూర్‌/కాగజ్‌నగర్‌, ఆగస్టు 21:ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా బుధవారం దళిత సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ మండలాల్లో సంపూ ర్ణంగా జరిగింది.

 Kumaram Bheem Asifabad: మండలాల్లో బంద్‌ సంపూర్ణం, ప్రశాంతం

వాంకిడి/బెజ్జూరు/సిర్పూర్‌(టి)/జైనూర్‌/కాగజ్‌నగర్‌, ఆగస్టు 21:ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా బుధవారం దళిత సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ మండలాల్లో సంపూ ర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. బంద్‌ తో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. వాంకి డిలో అంబేద్కర్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బెజ్జూరులో మండల పర్య టనకు వచ్చిన కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు నాయ కులు వినతిపత్రం అందజేశారు. జైనూరులో దళిత సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు కాంబ్లే అశోక్‌, బాబా సాహెబ్‌ మాట్లాడుతూ కలిసిమెలిసి జీవిస్తున్న ఎస్సీలను వర్గీకరించడం అన్యాయ మన్నారు. కాగజ్‌నగర్‌లో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వెంటనేఆపేయాలన్నారు.ఇది ముమ్మా టికి ఎస్సీలలో చిచ్చుపెట్టె దుశ్చర్యని ఆరోపించారు. సిర్పూర్‌(టి)లో అంబేద్కర్‌సంఘం నాయకులు విలాస్‌,దేవిదాస్‌,గణేష్‌,తులసీరాం,విక్రం, వసంత్‌ రావు, రమేష్‌, కుశాల్‌, అశోక్‌, మహదేవ్‌ తదితరులు ర్యాలీనిర్వహించారు. జైనూరులోజరిగిన కార్యక్రమం లో దళితసంఘాల నాయకులు కాంబ్లే నాగోరావ్‌, భుతాలెకిరణ్‌, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 10:26 PM