Share News

Kumaram Bheem Asifabad: నేటి నుంచి మున్సిపాలిటీగా ఆసిఫాబాద్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:57 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 1: ఆసిఫాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీని మున్సిపాలిటీ గా అప్‌గ్రేడ్‌ చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Kumaram Bheem Asifabad:   నేటి నుంచి మున్సిపాలిటీగా ఆసిఫాబాద్‌

- జీవో విడుదల చేసిన ప్రభుత్వం

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 1: ఆసిఫాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీని మున్సిపాలిటీ గా అప్‌గ్రేడ్‌ చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీ విభాగం డైరెక్టర్‌ డి దివ్య ఉత్తర్వులను విడుదల చేశారు. జనకాపూర్‌, గొడవెళ్లితో కలుపుకొని మొత్తం 20వార్డులతో ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. శుక్రవారంనుంచి ఆసిఫాబాద్‌మున్సిపాలిటీగా కొనసాగనున్నది. ఆసిఫాబాద్‌ మున్సిపల్‌కమిషనర్‌గా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకమిషనర్‌కు ఇంచార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి కమిషనర్‌ నియమించేంతవరకు ఆయన పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని జీవోలోపేర్కొన్నారు. దీంతోఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆసిఫాబాద్‌ పట్టణవాసుల కల సాకారం అయింది.

Updated Date - Feb 01 , 2024 | 10:57 PM