Share News

Kumaram Bheem Asifabad: విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:13 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 5: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యార్థి యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విద్యార్థిసంఘాల నాయకులు పేర్కొన్నారు.

Kumaram Bheem Asifabad:  విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 5: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యార్థి యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విద్యార్థిసంఘాల నాయకులు పేర్కొన్నారు. తొందరపాటు చర్యలకుపోతే ప్రజల్లో విశ్వసనీయతను కోల్పో తారన్నారు. ప్రజాపాలన మాటున అరెస్టులుచేస్తున్న కాంగ్రెస్‌ప్రభుత్వ తీరు ను ఖండించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తిరుపతి, చిరం జీవి, ప్రణయ్‌, ప్రశాంత్‌, అయ్యూబ్‌ఖాన్‌, నాగరాజు, ప్రణయ్‌ తదిరులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

వాంకిడి/పెంచికలపేట: నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా అని బీజేవైఎం నాయ కులు అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఉదయం పోలీసులు వాంకిడి, పెంచికలపేట మండలాల్లో బీజేపీ, బీజే వైఎం నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై ధర్నాలు చేస్తే అక్ర మంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాంకిడిలో నాయకులు మహేష్‌, గణేష్‌, అక్షయ్‌, బాలరాజు, పెంచికలపేటలో నాయకులు సంతోష్‌, కాంతా రావు, మధుకర్‌, రాజన్న, ప్రభాకర్‌,వెంకన్న, ప్రభాకర్‌, రాజేష్‌, శోభన్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:13 PM