Share News

Kumaram Bheem Asifabad: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:27 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6: జిల్లాలో మే13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలె క్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎస్పీ సురేష్‌కుమార్‌ అదనపు కలెక్టర్‌ దాసరివేణుతో కలిసి విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు.

 Kumaram Bheem Asifabad: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6: జిల్లాలో మే13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలె క్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎస్పీ సురేష్‌కుమార్‌ అదనపు కలెక్టర్‌ దాసరివేణుతో కలిసి విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ వరకు 4,55,437మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరికి 676పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 597ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ సంఖ్య 676పెరిగిందన్నారు. దీనిలో 47సమస్యాత్మక, 22మావోయిస్టు ప్రభా విత, 56నెట్‌వర్క్‌లేని పోలింగ్‌కేంద్రాలుగా గుర్తించి నట్లు వివరించారు. గతఅనుభవాల దృష్ట్యా పోలింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు కాకుండా పోస్టల్‌బ్యాలెట్‌వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు ఎలిపారు. శిక్షణ సమయంలో ఫాం రూ.12ద్వారా దరఖాస్తు తీసుకుం టున్నట్లు తెలిపారు. సదరు ఉద్యోగి జిల్లాలోలేదా వారిసొంత నియోజక వర్గంలో ఓటువేసే వెసులుబాటు ఉంటుం దన్నారు. దీనిని ముందుగానే తెలియజేయాల్సి ఉంటుం ద న్నారు. పోస్టల్‌ ఉద్యోగులు మే3నుంచి 8వవరకు ఓటువేయవచ్చన్నారు. ఓటువినియోగంరోజు సాధా రణ సెలవుదినం వర్తిస్తుందని వివరించారు. ఫిర్యా దుల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఫిర్యాదులను 1950, లేదా 08733-279033కి ఫోన్‌ చేయవచ్చన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 10:27 PM