Share News

Kumaram Bheem Asifabad : ఆనంద కేళి.. హోలీ

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:48 PM

బెజ్జూరు, మార్చి 23: హోలీ అంటే చాలు పిల్లలు, పెద్దలు ఎగిరి గంతేస్తారు. రంగులతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే. రంగులను ఒకరికి ఒకరు పూసుకో వడం, రంగునీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం, డీజే పాట లకు నృత్యాలు చేస్తుండటం ప్రతీ ఒక్కరికి సరదా. పండగ వేళ రంగులను వ్యాపారులు విక్రయిస్తున్నారు.

Kumaram Bheem Asifabad :  ఆనంద కేళి.. హోలీ

- సహజ రంగులే మేలు

- అంబరాన్నంటనున్న సంబరాలు

బెజ్జూరు, మార్చి 23: హోలీ అంటే చాలు పిల్లలు, పెద్దలు ఎగిరి గంతేస్తారు. రంగులతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే. రంగులను ఒకరికి ఒకరు పూసుకో వడం, రంగునీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం, డీజే పాట లకు నృత్యాలు చేస్తుండటం ప్రతీ ఒక్కరికి సరదా. పండగ వేళ రంగులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలురకాల రంగు లను కొనిస్తారు. ఇందులో ప్రమాదకర రసాయనాలు న్నాయన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. సహజ రంగులను హోలీ పంబరాల్లో వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉత్తర భారతంలో చాలాచోట్ల సహజ రంగులను ఎక్కువగా వాడుతుంటారు. పూలు, ఆకులు, పండ్లతో రంగులను తయారుచేసే ఓపిక, తీరిక లేని నేటి ఆదునిక కాలంలో రసాయన రంగులను విరివిగా ఉపయో గిస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో మార్వాడీలు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఈ పండుగను ఇష్టంగా జరుపుతారు. దేవుళ్లకు పూజలు చేసి రంగులు చల్లుకుంటారు. కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల డీజేలు పెట్టి రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేయడం పరిపాటిగా వస్తోంది.

ఇలా చేద్దాం..

చర్మానికి రంగులు పట్టుకోకుండా ఆవాల నూనె కాని, పెట్రోలియం జెల్లీని కానీ బాగా పట్టించాలి. కళ్లలో రంగులు పడకుండా కంటి అద్దాలను వాడాలి. పొడవాటి చేతులు ఉన్న దుస్తులు ధరించాలి. మొటిమలు ఉన్నవారు రంగులు ముఖంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఈ సమస్య మరింత ఎక్కువై ఇబ్బంది పెడు తుంది. హోలీ ఆడిన వెంటనే చేతులను శుభ్రంగా కడు క్కోవాలి. లేకుంటే చేతివేళ్లు, గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇతరులకు ఇబ్బంది కలగకుండా..

మన ఆనందం ఇంకొకరికి ఆవేదన కలిగించకూడదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకులు బైకులపై దూసు కొచ్చి పాదచారులు, వాహనదారులపై రంగులు చల్లుతున్నారు. దీనివల్ల ఖరీదైన వస్ర్తాలు కరాబు కావ డంతో అనేక మంది ఆవేదన చెందుతున్నారు. స్నేహితులు, తెలిసినవాళ్లపై రంగులు చల్లితే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ రోడ్లపై రంగులతో విన్యాసాలు చేయకుండా నిరోధించాలి. పోలీసులు యువతలో అవగాహన కల్పించాల్సి ఉంది. అదే విధంగా ఈనెల 25న హోలీరోజున పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

రసాయన రంగులతో ప్రమాదం..

రంగుల్లో పాదరసం, సిలికా, మైకా, సీసం వంటి పలు రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మానికి, కళ్లకు, శ్వాససంబంధ సమస్యలకు కారణం అవుతాయి. వాటర్‌ గన్‌, వాటర్‌ బెలూన్‌లతో హోలీ ఆడటం వల్ల చెవిలోకి రంగునీరు వెళ్లి దురద, చెవినొప్పి కలుగుతుంది. చెవిపొర దెబ్బతిని చెవిపోటు కలుగుతుంది. పొడిరంగులను చల్లినప్పుడు అవి గాలిలో కలిసిపోయి నోటిలోకి, శ్వాసనాళా ల్లోకి పోయి శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. మనం గాలి పీల్చినప్పుడు ఈ రంగులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయి దీర్ఘకాల సమస్యలను కలిగిస్తాయి. ఆస్తమా, ఎలర్జీ కలుగుతుంది. సింథటిక్‌ రంగులను వాడటం వల్ల జలుబు, అలర్జీ కలుగుతాయి. దురద, మంట, నొప్పి కలుగుతుంటాయి. కళ్లల్లోకి రంగులు పడి నప్పుడు కళ్లమంట, దురద పెరుగుతుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. గాఢమైన రంగులు పడినప్పుడు కంటిపొరలు దెబ్బతిని చూపు మందగించే అవకాశం ఉంది. రంగులు నోట్లోకి వెళితే వాంతులు, విరోచనాలు అవుతాయి. రసాయనాలు చర్మం గుండా శరీరంలోకి చేరుతాయి. దీంతో వికారం, వాంతులు, కడుపునొప్పి కలుగుతాయి.

రంగులు ఇలా..

పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో రకరకాల రంగు లను తయారు చేసుకొని హోలీ ఆడుకోవచ్చు. వీటితో ఎలాంటి హానీ జరగదు. దానిమ్మ, టమాటలతో ఎరుపు. మోదుగపూలు, క్యారట్‌తో ఆరెంజ్‌ రంగు, బీట్‌రూట్‌తో ఊదారంగు, పాలకూర, కొత్తిమీరతో ఆకుపచ్చ రంగు, సహజసిద్ధ పసుపు, కుంకుమలతో ఆయా రంగులు, బంతి, చామంతి పువ్వుల రంగును బట్టి ఆయా రంగులను సిద్ధం చేసుకోవచ్చు. వీటిని మరగబెట్టడం వల్ల మరింత గాఢత్వం సంతరించుకుంటాయి.

Updated Date - Mar 24 , 2024 | 10:48 PM