Share News

Kumaram Bheem Asifabad: అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 03 , 2024 | 11:09 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 3: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కాగజ్‌నగర్‌ పట్ట ణంలో నిర్వహించే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు.

Kumaram Bheem Asifabad:  అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలి

- బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 3: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కాగజ్‌నగర్‌ పట్ట ణంలో నిర్వహించే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆపార్టీ రాష్ట్ర నాయకులు బోనగిరి సతీష్‌బాబు, జడ్పీటీసీ అరిగెల నాగే శ్వర్‌రావు, బీజేపీ జిల్లా కోకన్వీనర్‌ మయూర్‌ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి అధినాథ్‌, రాష్ట్ర మహిళామోర్చా నాయకురాలు సిద్దంశెట్టి సుహాసినితో కలిసి ఏర్పాటుచేసిన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల5 ఆదివారం ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె స్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 12స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. బీజేపీ గెలుపుకోసం అమిత్‌షా బహిరంగ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సత్య నారాయణ, ప్రసాద్‌గౌడ్‌, శ్రావణ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎం క్రీడామైదానంలో సభ..

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌లో ఈనెల 5న ఎస్పీఎం క్రీడామైదానంలో నిర్వహిం చే వికాస సంకల్పసభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో సంతోష్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వస్తున్నారని తెలిపారు. సభకు అధికసంఖ్యలో ప్రజలను తీసుకురావాలని కార్యకర్తలకు సూచిం చారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు మాట్లాడుతూ సభను విజయవంతం చేసేం దుకు అభిమానులు, కార్యకర్తలు తమవంతు బాధ్యతగా ప్రజ లను తరలించాలన్నారు. ఈ సందర్భంగా వికాస సంకల్ప సభావేదికకు వారు భూమిపూజ చేశారు.

Updated Date - May 03 , 2024 | 11:09 PM