Share News

Kumaram Bheem Asifabad: అడుగంటిన చెరువులు, కుంటలు

ABN , Publish Date - May 15 , 2024 | 10:10 PM

బెజ్జూరు, మే 15: భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు అడగం టిపోతున్నాయి. గ్రామాల్లో ప్రజలకు మిషన్‌ భగీరథ, కులాయి ద్వారా నీరందుతోంది. కానీ చెరువులు కుంటలపైనే ఆధారపడే మూగజీవాలు నీటికి అల్లాడు తున్నాయి.

Kumaram Bheem Asifabad: అడుగంటిన చెరువులు, కుంటలు

- దాహర్తి కోసం పశువుల తండ్లాట

బెజ్జూరు, మే 15: భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు అడగం టిపోతున్నాయి. గ్రామాల్లో ప్రజలకు మిషన్‌ భగీరథ, కులాయి ద్వారా నీరందుతోంది. కానీ చెరువులు కుంటలపైనే ఆధారపడే మూగజీవాలు నీటికి అల్లాడు తున్నాయి. పశువులు దాహర్తి కోసం తండ్లా డుతు న్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో పశుపోషకులు పశువులను మేతకు విడిచిపెడుతున్నారు. ఇలా బయట సంచరించే పశువులకు తాగునీరు లేక విలవిలలాడు తున్నాయి. ఎక్కువగా పశువులు మేత మేసే సమ యంలో సమీపంలోని వాగులు, చెరువుల్లో దాహర్తి తీర్చుకుంటాయి. కానీ ఎండల కారణంగా చుక్కనీరు లేక వాటి దాహార్తి తీరడం లేదు.

అలంకారప్రాయంగా నీటి తొట్టెలు..

పశువుల దాహార్తి కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. నీటి తొట్టిలను నిర్మించడమే తప్ప వాటిని నీటితో నింపడం లేదు. గ్రామాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టెలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి.

Updated Date - May 15 , 2024 | 10:10 PM