Kumaram Bheem Asifabad: 124కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:00 PM
దహెగాం, జూన్ 17: మండలంలోని హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనా లను పట్టుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.

దహెగాం, జూన్ 17: మండలంలోని హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనా లను పట్టుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన పక్కా సమాచారం మేరకు హత్తిని గ్రామంలో దాడులు నిర్వహించగా తాళ్లపల్లి మనోజ్‌రావు ఇం ట్లో 124కిలోల నకిలీ పత్తి విత్తనాలు బండి సింహాద్రి అనేవ్యక్తి ట్రాక్టర్‌లో నింపుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్‌తోపాటు నకిలీ పత్తివిత్తనాలను స్వాధీనపర్చుకుని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇన్‌చార్జి వ్యవసాయాధికారి రాజుల నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి సింహాద్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. వీటివిలువ రూ.3.10 లక్షలు ఉంటుందని అన్నారు.