Share News

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:17 PM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు, 9 ప్రైవేటు జూని యర్‌ కళాశాలల్లో, 6 కేంద్రాలను మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో, కేజీ బీవీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ఇంటర్మీడియట్‌  పబ్లిక్‌ పరీక్షలు

ఏసీసీ, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు, 9 ప్రైవేటు జూని యర్‌ కళాశాలల్లో, 6 కేంద్రాలను మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో, కేజీ బీవీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్‌ టికెట్‌లను సంబంధిత కళాశాలల ద్వారా ఆన్‌లైన్‌లో బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ల ద్వారా విద్యార్థులకు అందాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరానికి జిల్లాలో 8394 మంది, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి 7135 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరు కానున్నారు. బుధవారం నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఈ నెల 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. రోజు ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అరగం ట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిం చరని ఇంటర్‌ బోర్డు అధికారులు ఆదేశించారు.

-పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. కేంద్రాల సమీ పంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లను మూసి ఉంచాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికిఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్టుమెంటల్‌ ఆఫీస ర్‌ వంతున 25 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 25 మంది డిపార్టుమెం టల్‌ ఆఫీసర్లను నియమించారు. సమీప పోలీస్‌స్టేషన్‌లలో ప్రశ్నపత్రా లను భద్రపరిచేందుకు కస్టోడియన్‌లను నియమించారు. ప్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను సీనియర్‌ లెక్చరర్‌, ఏఎస్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్‌ సభ్యులుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో సున్నితమైన పరీక్ష కేంద్రంగా కాసిపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను గుర్తించారు. సున్నితమైన పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన కేంద్రాల్లో ముగ్గురు సభ్యుల సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీం నిఘా పెట్టనుంది. డీఐఈవో కన్వీనర్‌గా సీనియర్‌ ప్రిన్సిపాల్‌, సీని యర్‌ లెక్చరర్‌ సభ్యులుగా డిస్ర్టిక్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ ఆధ్వర్వంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు.

-పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి...

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి వసతి, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంటారు. పరీక్ష కేంద్రాల్లో లైటింగ్‌, ఫ్యాన్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. విద్యార్థులు బ్లూ, బ్లాక్‌, బాల్‌ పెన్‌, మ్యాధమ్యాటిక్స్‌ పరీక్ష రోజు కంపాక్స్‌బాక్స్‌, సైన్స్‌ పరీక్ష రోజు డ్రాయింగ్‌ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారు. చేతి గడియారాలు, ఎలక్ర్టానిక్‌ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు.

పకడ్బందీగా నిర్వహణ

-శైలజ, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి

ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం. అధికారుల కేటాయింపు, కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశాం. హాల్‌ టికెట్లలో ఏమైనా తప్పులున్నా, ఫొటో, సంతకం సరిగ్గా లేకపో యినా డిస్ర్టిక్‌ ఎగ్జామినేషన్‌ కమిటీని సంప్రదించాలి. సంబంధిత కళాశాల సిబ్బంది ద్వారా నామినల్‌ రోల్స్‌ను వెరిఫై చేసి సరి చేయడం జరుగుతుంది. సరి చేసిన హాల్‌ టికెట్‌ ద్వారా విద్యార్థులు పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం.

Updated Date - Feb 27 , 2024 | 10:17 PM