Share News

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

ABN , Publish Date - May 26 , 2024 | 10:28 PM

బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్ల రామురెడ్డిలు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

చెన్నూరు, మే 26: బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్ల రామురెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 9 వేల టన్నుల ధాన్యం రైసుమిల్లలకు తరలించారన్నారు. ధాన్యం డబ్బులు రెండు మూడు రోజుల్లోనే సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ గోమాసె బొగ్గు లారీలను అమ్ము కుంటాడని, అతను వ్యవసాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మాటలు ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. కౌన్సి లర్లు పోగుల సతీష్‌, హేమంత్‌రెడ్డి, బాపురెడ్డి, శ్రీదర్‌,సుశీల్‌కుమార్‌, అంకాగౌడ్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, బానేష్‌, శ్రీకాంత్‌,అన్వర్‌, రాజేష్‌, మహేష్‌ పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామిని విమర్శిస్తే ఊరుకునేది లేదని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు బండి సదానందం యాదవ్‌ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ చెన్నూరులో ఇటీవల అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, వడ్లకు బోనస్‌ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని తెలిపారు.

భీమారం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామిపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు పోడేటి రవి, శ్రీనివాస్‌ పేర్కొ న్నారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి విదేశీ పర్యటనలు చేస్తున్నారని రైతులు, ప్రజల గోసలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయనుందని, దీన్ని ఓర్వలేక వారిని ఉనికి కాపాడు కునేందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. లక్ష్మణ్‌, సత్తిరెడ్డి, బలరాంరెడ్డి, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్‌: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ను విమర్శించే నైతిక హక్కు బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసెకు లేదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్‌ ఫయాజ్‌లు అన్నారు. రైతులపై లాఠీచార్జీ చేయించిన బీజేపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సుమారు 80 శాతం వడ్లు మిల్లులకు చేరాయన్నారు. మంతెన లక్ష్మణ్‌, శీలం వెంకటేష్‌, రవీందర్‌రెడ్డి, రమేష్‌, మల్లేష్‌,నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 10:28 PM