Share News

సక్రమంగా అందని పౌష్టికాహారం

ABN , Publish Date - May 04 , 2024 | 10:58 PM

పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందిస్తు న్నారు. అయితే పాలు, కోడిగుడ్లు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్తగా యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది.

సక్రమంగా అందని పౌష్టికాహారం

కాసిపేట, మే 4: పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందిస్తు న్నారు. అయితే పాలు, కోడిగుడ్లు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్తగా యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులకు సరు కుల పంపిణీలో పారదర్శకత పాటించాలని తెచ్చిన ఈ యాప్‌లు సాంకే తిక సమస్యలతో అడ్డంకిగా మారాయి. యాప్‌లలో నమోదైతేనే ఇండెంట్‌ వస్తుంది. లేదంటే ఈ కేంద్రానికి సరుకుల కేటాయింపు జరగదు. దీంతో అధికారులు, టీచర్లు, లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జిల్లా లోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు ప్రాజెక్టుల పరిధిలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 4359 మంది గర్బిణీలు, 4580 మంది బాలింతలు ఉన్నారు. ఏడాదిలోపు పిల్లలు 4461 మంది, ఏడాది నుంచి 3 ఏండ్ల లోపు పిల్లలు 19,579 మంది ఉండగా, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు 19,848 మంది ఉన్నారు. పిల్లలకు బాలామృతం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ పేరుతో అనుబంధ పోషకాహారాన్ని అందిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలతోపాటు కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 30 శాతం మందికి అనుబంధ పోషకా హారం అందక గిరిజన మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.

అనుబంధ పోషకాహారం పంపిణీ ఇలా..

గర్భిణీలు, బాలింతలకు ప్రతీ నెల 30 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కిలోల బియ్యం, అరకిలో కందిపప్పు, 400 గ్రాముల మంచి నూనె అందించాలి. అలాగే 1 నుంచి 3 ఏండ్లలోపు పిల్లలకు 16 గుడ్లు ఇంటికి ఇవ్వాలి, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలకు రెండున్నర కిలోల బాలామృతం, రోజు ఒక గుడ్డు చొప్పున అందించాలి. పిల్లల హాజరు శాతం ఎక్కువగా ఉన్న చోట ఆయాలు ఇంటి వద్దనే వంట చేసుకుని కేంద్రానికి తెచ్చి వడ్డిస్తున్నారు. దీంతో పిల్లలకు సరైన భోజనం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాగా మిగిలిన వారికి ఇండెంట్‌ సరిగ్గా లేకపోవడంతో వచ్చిన సరుకులతోనే అంగన్‌వాడీ సిబ్బంది సరిపెడుతున్నారు.

యాప్‌లతో అవస్థలు...

గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల హాజరును రిజిష్టర్‌లలో నమోదు చేసేవారు. దీని ఆధారంగానే వారికి పోషణ ఖరారయ్యేది. ప్రభుత్వం తాజాగా యాప్‌లను రూపొందించింది. రోజు యాప్‌లో లబ్ధిదారులను నమోదు చేయాలి. కేంద్రం రూపొందించిన పోషణ వాకర్‌ యాప్‌లో రోజు ఆధార్‌ వెరిఫికేషన్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) యాప్‌లో లబ్ధిదారుల ముఖ హాజరు నమూనా చేయాలి. ఇలా నమోదు చేసేటప్పుడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. యాప్‌లో నమోదు చేసే సమయంలో ఏ రోజుకారోజు ఎగ్జిస్టింగ్‌ అని వస్తుంది. దీంతో కొన్ని సార్లు పేర్లు నమోదు కావడం లేదు. ఒక్కోసారి పేర్లు నమోదైంది లేనిది తెలియడం లేదు. ఇండెంట్‌ వచ్చిన తర్వాత చూసుకుంటే కొంత మందికి సరుకులు తగ్గి వస్తున్నాయి. దీంతో టీచర్లు లబ్ధిదారులతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.

Updated Date - May 04 , 2024 | 10:58 PM