ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 08 , 2024 | 10:16 PM
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో మహిళలను ఘనంగా సన్మానిం చారు.
ఏసీసీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో మహిళలను ఘనంగా సన్మానిం చారు. చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే పోశమ్మ, ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న దుర్గమ్మ, ఇండ్లలో పనులు చేసే సావిత్రిలను గర్మిళ్ల వాకర్స్ క్లబ్ నాయకులు సన్మానించారు. ముగ్గురు మహిళల భర్తలు చని పోయినప్పటికీ కష్టపడి పనిచేస్తూ పిల్లలను పెద్ద చేసి కుటుంబాలను పోషిస్తున్నారని పేర్కొన్నారు. మధుసూదన్‌రావు, శ్రీనివాస్, మల్లేష్, సత్యనారాయణరెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
జన్నారం: మండలంలోని జన్నారం, రేండ్లగూడ గ్రామాల్లో శుక్రవారం మహిళ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ముజఫార్‌ఆలీఖాన్, మేకల మాణిక్యం, ఎంపీటీసీ మమతకరుణాకర్, పం కజ, లావణ్య, శంకర్, అజర్, వసీం, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే జన్నారంలో కాంగ్రెస్ మహిళ నాయకురాలు ఎల్ల లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో 50 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సుభాష్‌రెడ్డి, రిజాయుద్దీన్,మోహన్‌రెడ్డి, పసివుల్లా, రాజన్న,పద్మారావులు పాల్గొన్నారు.