Share News

ఘనంగా శౌర్య దివాస్‌

ABN , Publish Date - Jan 01 , 2024 | 10:33 PM

నస్పూర్‌ పట్టణంలోని సీసీసీ కార్నర్‌ వద్ద మాల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం బీమా కోరెగావ్‌ యుద్ధ విజ యోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా శౌర్య దివాస్‌

నస్పూర్‌, జనవరి 1: నస్పూర్‌ పట్టణంలోని సీసీసీ కార్నర్‌ వద్ద మాల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం బీమా కోరెగావ్‌ యుద్ధ విజ యోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యుద్ధంలో మృతి చెందిన అమరులను స్మరిస్తూ కార్నర్‌లోని అంబేద్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ సంఘ నాయకు లు మా ట్లాడుతూ 1 జనవరి 1818లో పూణె సమీ పంలోని కోరెగావ్‌ గ్రామంలో పీష్వా, మహార్‌ సైని కుల మధ్య జరిగిన యుద్ధంలో విజయం సాధించి నందున అప్పటి నుంచి జనవరి 1ని శౌర్య దినో త్సవంగా జరుపుకొంటున్నారన్నారు. యుద్ధంలో మృతి చెందిన మహార్‌ సైనికులకు నివాళులర్పి స్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి వెంకటరమణ, మాల సంక్షేమ సంఘం నస్పూర్‌ పట్టణ అధ్యక్షు డు గోసిక మనోజ్‌ కుమార్‌, నాయకులు దీలిప్‌, యుంగధర్‌, కొండ రాజయ్య, లింగయ్య, పవన్‌, శరన్‌, రమేష్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

కాసిపేట: భీమాకోరేగావ్‌ అమరవీరులకు దళిత బహుజన సంఘాలు ఘనంగా నివాళులర్పించాయి. సంఘాల నాయకులు మాట్లాడుతూ వేలాది బ్రహ్మ ల పీస్వా సైన్యంపై విరోచిత పోరాటం చేసి అమ రులైన వీరుల స్ఫూర్తిని కొనియాడారు. విజయ స్థూపం చిత్రపటానికి నివాళులర్పించారు. నాయ కులు పల్లె మల్లయ్య, బాపు, గంట సత్యం, దాసరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: బీమా కోరేగాం అమరుల స్ఫూర్తిని నిలబెట్టాలని దళిత, బహుజన ఐక్య వేదిక నాయకులు పలిగిరి కనకరాజు పేర్కొన్నారు. బీమా కోరేగాం అమరుల శౌర్య దివస్‌ను పురస్కరించుకొని మంచిర్యాలలోని అమరుల స్థూపం వద్ద నివాళుల ర్పించారు. వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుం దని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. నాయకులు రాజేశం, రామ్మూర్తి, మల్లయ్య, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

సమతా సైనిక్‌ దళ్‌ ఆధ్వర్యంలో బీమా కోరేగాం అమరుల కోసం స్థానిక అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి, షాకీర్‌, రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 10:33 PM