Share News

గ్రూప్‌ 1 అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:17 PM

గ్రూప్‌ 1 ప్రిలి మినరీ పరీక్ష ఈనెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని కలె క్టర్‌ బదావత్‌ సంతోష్‌ శుక్రవారం ఒక ప్రక టనలో తెలిపారు.

గ్రూప్‌ 1 అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 7: గ్రూప్‌ 1 ప్రిలి మినరీ పరీక్ష ఈనెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని కలె క్టర్‌ బదావత్‌ సంతోష్‌ శుక్రవారం ఒక ప్రక టనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌లను టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ న్నారు. ఉదయ 9 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామ న్నారు. 10 గంటలు దాటిన తర్వాత కేంద్రాల్లోకి అను మతి ఉండదన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే అభ్యర్థులు నిర్ధారించుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో 9.30 గంటలకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ప్రారంభి స్తారన్నారు. బయోమెట్రిక్‌ తీసుకునేందుకు అభ్య ర్థుల వేళ్లపై మెహందీ, టాటూస్‌, ఇతరత్రా ఉండరాదని తెలిపారు. బూట్లు, మొబైల్‌ఫోన్‌లు, నోట్స్‌, జువెల్లరీ తదితర ఉపకరణాలకు అనుమతి ఉండద న్నారు. జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,384 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి, సహాయానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 08736-250500 ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థిని అభినందించిన కలెక్టర్‌

తాండూర్‌ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని దుర్గం మమత ఇంటర్‌ ఫలితాల్లో 979 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించగా శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ విద్యార్థిని అభినందించారు. శాలువా తో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. మున్ముం దు కూడా మంచి ఫలితాలు సాధించాలని సూచిం చారు. డీఈవో యాదయ్య, కళాశాల ప్రత్యేకాధికారి సుమనచైతన్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 10:18 PM