Share News

విద్యార్థులకు మెమోంటోలు అందజేత

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:57 PM

జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థు లకు డీఈవో యాదయ్య గురువారం జిల్లా కేంద్రం లోని సైన్స్‌ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మెమోంటో, ప్రశంసాపత్రాలను అందించారు.

విద్యార్థులకు మెమోంటోలు అందజేత

ఏసీసీ, మార్చి 28: జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థు లకు డీఈవో యాదయ్య గురువారం జిల్లా కేంద్రం లోని సైన్స్‌ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మెమోంటో, ప్రశంసాపత్రాలను అందించారు. జన వరి 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ ఎగ్జి బిషన్‌లో ప్రతిభ కనబర్చిన 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జిల్లా స్ధాయి ఇన్‌స్పైర్‌ పోటీలు ఆన్‌ లైన్‌లో నిర్వహించగా 10 మంది రాష్ట్ర స్థాయికి ఎం పికయ్యారు. రెండు పోటీల్లో జిల్లా స్ధాయి విజేత లకు బహుమతులు అందించారు. డీఈవో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈవో మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ఇలాంటి పోటీలు ఎంత గానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ పోటీల్లో విజేతలుగా పొట్టపల్లి నరేష్‌, మైదం స్ఫూర్తి, విజయ్‌, షేక్‌ సాధిక్‌, కొమ్మెర శ్రీవత్స, హర్షిత, శ్యామల, సుశ్మిత, రవళి, ప్రశాంత్‌లు మొద టి పది స్ధానాల్లో నిలిచారు. జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మాణిక్‌రావు, శ్రీనిత, నిషిశ్రీ, వైష్ణవి, గంగారాం, జగదీశ్వర్‌, సందీప్‌, ప్రమీల్‌కు మార్‌, శాంత్‌రాజ్‌, సాయిసుశాంత్‌లు మొదటి పది స్ధానాల్లో నిలిచారు. జిల్లా సైన్స్‌ అధికారి మధు బాబు, కుమారస్వామి, పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 10:57 PM