Share News

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:24 PM

ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. రోడ్డు భధ్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంపల్లిలోని ఆర్టీఏ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

హాజీపూర్‌, జనవరి 30: ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. రోడ్డు భధ్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంపల్లిలోని ఆర్టీఏ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి వాహనం నడపాలని, ట్రిబుల్‌ రైడింగ్‌ చేయరాదని సూచించారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలు నడపవద్దన్నారు. నియమాలు ఉల్లం ఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంవీఐ వివేకానంద రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ వాడాలి

ఏసీసీ, జనవరి 30: హెల్మెట్‌ ప్రాణాన్ని కాపాడే ఆయుధమని డీసీసీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని హెల్మెట్‌ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ మోటార్‌ సైకిల్‌ నడిపే వాహన దారులు హెల్మెట్‌ ధరించాలని, ఉపయోగించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురై తరుచుగా మృత్యువాత పడతున్నారని అన్నారు. వాహనానికి సంబంధిం చిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రిబుల్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయవద్దని సూచించారు. ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:24 PM