Share News

మూగజీవాలకు పశుగ్రాసం కొరత

ABN , Publish Date - May 21 , 2024 | 10:22 PM

పశుగ్రాసం కొరతతో రైతులకు పశువుల పోషణ భారంగా మారుతోంది. ఆరుబయ ట మేత లభించక మూగ జీవాలు తల్లడిల్లిపోతు న్నాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా పశుగ్రాసం దొరకని దుస్థితి నెలకొంది. గడ్డి ధరలు కూడా ఆకాశన్నంటాయి.

మూగజీవాలకు పశుగ్రాసం కొరత

నస్పూర్‌, మే 21: పశుగ్రాసం కొరతతో రైతులకు పశువుల పోషణ భారంగా మారుతోంది. ఆరుబయ ట మేత లభించక మూగ జీవాలు తల్లడిల్లిపోతు న్నాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా పశుగ్రాసం దొరకని దుస్థితి నెలకొంది. గడ్డి ధరలు కూడా ఆకాశన్నంటాయి. వర్షాభావ పరి స్థితుల కారణంగా గడ్డి సమస్య అన్నదాతను వెం టాడుతోంది. పశువులకు వేసే పచ్చిగడ్డి, తిండి గింజలు, పశుగ్రాసం కొరతతోపాటు నీటి సమస్య ఎదురవుతోంది. జిల్లాలో ఆవులు, ఎద్దులు 2.10 లక్ష లు, గేదెలు లక్షా 5 వేలు, గొర్రెలు 5.20 లక్షలు, మేకలు 2.30 లక్షలున్నాయి.

తగ్గిన గ్రాసం ఉత్పత్తి

జిల్లాలో వరి లక్ష ఎకరాలు, మొక్కజొన్న 260 ఎక రాలు, జొన్న 120 ఎకరాలు, పెసర 20 ఎకరాలు, కం ది 20 ఎకరాల్లో సాగు చేస్తారు. పశు సంపదకు సరిపడిన గ్రాసం ఉత్పత్తి కాకపోవడంతో గ్రాసం కొరత ఏర్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు తగ్గడం కూడా ఒక కారణం. పశుగ్రాసం కొరత కార ణంగా పశుపోషణ భారంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్‌లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 200 మెట్రిక్‌ టన్నుల పచ్చి గడ్డి విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 20 కిలోల గడ్డి విత్తనాలను సాగు చేయవచ్చని, ఫలితంగా రైతుకు పశుగ్రాసం కొరత తీరుతుందని పేర్కొంటున్నారు.

గ్రాసం కోసం తిప్పలు...

పాడి పశువులను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుకు కొంత ఆదా యాన్ని ఇచ్చే పాడి సంతతి తగ్గిపోతోంది. ఇప్పటికే పశువుల సంఖ్య తగ్గుముఖం పట్టగా మిగిలిన కొద్ది పాటి పశువులకు గ్రాసం కొరత పట్టిపీడిస్తోంది. మూగజీవాలను సాకడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్ట తరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎండలతో చెరువులు, కుంటలు ఎండిపో యాయి. పశువులు దాహార్తి తీర్చలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

భగ్గుమంటున్న ధరలు

రైతులు పశుగ్రాసం కొనుగోలు చేద్దామంటే ధరలు భగ్గుమంటున్నాయి. చేన్లు చేలుక నుంచి అటుఇటు తిరిగొచ్చిన పశువులకు కనీసం నీటి వస తిని అందించలేని పరిస్థితిలో నెలకొంది. వరి గడ్డి ట్రాక్టర్‌ లోడు రూ.4000 నుంచి 4500 వరకు, ఎడ్లబండి గడ్డి రూ.2500 నుంచి 3000 వరకు, మొక్క జొన్న, జొన్న కట్ట రూ.50 నుంచి 60 వరకు, పచ్చి గడ్డి మోపు రూ.75 నుంచి 80 వరకు, పెం చుతున్న పచ్చి గడ్డి గుంట విస్తీర్ణంకు నెలకు రూ.1200 రూపాయలకు లభిస్తోంది. పాల వ్యాపా రం చేసే వారు రోజు గేదెలకు, ఆవులకు పచ్చి గడ్డి వేస్తారు. సరైనా తిండి లభించకపోతే పాల దిగుబడి

Updated Date - May 21 , 2024 | 10:22 PM