Share News

భూ కబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:18 PM

చెన్నూరు కుమ్మరికుంట చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతుందని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన ప్రజావాణిలో కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

భూ కబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ

చెన్నూరు, జనవరి 8: చెన్నూరు కుమ్మరికుంట చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతుందని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన ప్రజావాణిలో కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కొందరు భూకబ్జాదా రులు చెరువు శిఖం భూమిని కబ్జా చేసి సర్వే నెం బరు 971లో ఇల్లు నిర్మించుకొన్నామన్నారు. మున్సిప ల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసు కోవాలన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చెన్న సూర్య నారాయణ, కౌన్సిలర్‌ పోగుల సతీష్‌, నాయకులు శ్రీధర్‌, నాగరాజు, రాకేష్‌, మహేష్‌, సుశీల్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవి, ఉదయ్‌, సాహీర్‌, కరీం పాల్గొన్నారు.

ఫ జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జాకు గురైందని, భూమిని కాపాడాలని తహసీల్దార్‌, సీఐ, మున్సిపల్‌ కమిషనర్‌లకు వినతిపత్రం అందిం చారు. జర్నలిస్టులు మాట్లాడుతూ చెన్నూరులో ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నంబరు 863 భూమిలో కొందరు రియల్‌ వ్యాపారం చేసేందుకు కబ్జా చేస్తున్నారన్నారు. కత్తెరశాల రోడ్డులో గల సర్వే నెంబరు 863లో 8 ఎకరాల 5 గుంటల భూమి ని ఇండ్ల నిర్మాణానికి అప్పటి రెవెన్యూ అధికారులు ప్రోసీడింగ్‌ అందజేశారన్నారు. ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం జరగడంతో రియల్‌ వ్యాపారులు కబ్జా చేస్తున్నారన్నారు. వెంటనే భూమిని కాపాడి న్యా యం చేయాలని కోరారు.

ఆసుపత్రి భూమి కబ్జాపై

నెన్నెల: చిత్తాపూర్‌లో శిథి లావస్థలో ఉన్న ఐటీడీఏ ఆసు పత్రి భూమి ఆక్రమణకు గురైందని గ్రామస్థులు కలె క్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 141-1లో 1986 నుంచి 1993 వరకు ఐటీడీఏ ఆసు పత్రి నిర్వహించారు. 25 పడక లు, ఆపరేషన్‌ థియేటర్‌ ఉండే దన్నారు. ఆసుపత్రి ఎత్తివేయడంతో ప్రస్తుతం భవ నం శిథిలావస్థకు చేరింది. భూమిని ఓ బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆక్రమించుకొని చుట్టు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశాడని తెలిపారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు కేటా యించాలని కోరారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బెల్లంపల్లి ఆర్డీవోను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Jan 08 , 2024 | 10:18 PM