Share News

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:17 PM

ఎన్‌హెచ్‌ 63 గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను సోమవారం ముల్కల గ్రామానికి చెం దిన రైతులు అడ్డుకున్నారు. తహసీల్దార్‌ సతీష్‌కు మార్‌, ఆర్‌ఐ మంగ, సర్వేయర్‌ కృష్ణప్రియ, సిబ్బంది సర్వే చేయడానికి రాగా రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

హాజీపూర్‌, జనవరి 8: ఎన్‌హెచ్‌ 63 గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను సోమవారం ముల్కల గ్రామానికి చెం దిన రైతులు అడ్డుకున్నారు. తహసీల్దార్‌ సతీష్‌కు మార్‌, ఆర్‌ఐ మంగ, సర్వేయర్‌ కృష్ణప్రియ, సిబ్బంది సర్వే చేయడానికి రాగా రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ సర్వేలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, విలువైన వ్యవసాయ భూముల నుంచి రహదారి వెళ్తుండడంతో తమ భూ ములను కోల్పోవాల్సి వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను పొలాల మీదుగా కాకుండా జాతీయ రహదారి వెంబడి విస్తరణ చేయాలని కోరారు. తమ కు ముందుగా సమాచారం ఇచ్చి తమ డిమాండ్లు పరిష్కరించిన తర్వాత సర్వే చేయాలన్నారు. రైతులు సర్వేను అడ్డుకోవడంతో అధికారులు వెళ్లిపోయారు.

హైవేను రీ డిజైన్‌ చేయాలి

రామకృష్ణాపూర్‌: గ్రీన్‌ఫీల్డ్‌ హైవే-63 రీడిజైన్‌ చే యాలని క్యాతన్‌పల్లి సమీపంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌ ప్లాట్లు, ఇండ్ల బాధితులు కోరారు. సోమవారం వారు మంచిర్యాల-రామకృష్ణాపూర్‌ రహదారిపై ధర్నా చేప ట్టారు. భవిష్యత్‌ అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్లాట్లు హైవేలో పోయే అవకాశం ఉండడంతో ఆర్థి కంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లు, ఇండ్లు కోల్పోకుండా హైవేను రీ డిజైన్‌ చేయాలని కలెక్టర్‌ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jan 08 , 2024 | 10:17 PM