Share News

ఒత్తిడికిలోను కాకుండా పరీక్షలు రాయాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:27 PM

పదో తరగతి విద్యార్థులు భయపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాం తంగా పరీక్షలు రాయాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. గురువారం జన్నారంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.

 ఒత్తిడికిలోను కాకుండా పరీక్షలు రాయాలి

జన్నారం, ఫిబ్రవరి 29: పదో తరగతి విద్యార్థులు భయపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాం తంగా పరీక్షలు రాయాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. గురువారం జన్నారంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభు త్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు పరీక్ష లంటే భయం వీడేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విషయ నిపుణులు అందించే సూచనలు, సలహాలు పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చవచ్చన్నారు. ఎంపీడీవో శశి కళ, ఎంఈవో విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజ్‌ మనోహర్‌రెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంపీవో రమేష్‌, విషయ నిపుణులు, సైకాలజిస్టులు, ప్రధానోపాధ్యాయులు రాజమౌళి, రామన్న, రాజేందర్‌, శ్రీనివాస్‌, మురళీ దర్‌, ప్రభావతి, కమలాకర్‌, కిషన్‌ పాల్గొన్నారు.

దండేపల్లి: విద్యార్థులు భయం వీడితేనే పరీక్షలు బాగా రాయవచ్చని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నా రు. పదో తరగతి విద్యార్థులకు ముత్యంపేట ఎఎల్‌ ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భయాన్ని జయిస్తేనే పరీక్షల్లో విజయం సాధించ వచ్చన్నారు. ప్రతీ సబ్జెక్టుపై అవగాహన పెంచుకో వాలన్నారు. వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులకు చెప్పారు. మండల నోడల్‌ అధికారి డి.చిన్నయ్య, జెడ్పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీడీవో ప్రసాద్‌, ఎంపీవో శ్రీనివాస్‌, క్వాలిటీ కోఆర్డినటర్‌ సత్యనారాయణ మూర్తి, రిసోర్స్‌ పర్సన్స్‌, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 10:27 PM