Share News

అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:01 PM

లోక్‌సభ ఎన్ని కల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియో గించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కే రన్‌ ర్యాలీని అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, మోతి లాల్‌, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 28: లోక్‌సభ ఎన్ని కల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియో గించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కే రన్‌ ర్యాలీని అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, మోతి లాల్‌, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాటా ్లడుతూ దేశంలోని ప్రతీ పౌరునికి సమాన విలువ కలిగిన ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పిం చిందని, ఎన్నికల్లో వయస్సు అర్హత, ఓటరు జాబి తాలో పేరు గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కును విని యోగించుకోవాలన్నారు. పోలింగ్‌ శాతం పెంచేం దుకు కళాజాత, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన వారందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఏప్రిల్‌ 15లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియో గించుకోవాలన్నారు. కళాకారులు ఆలపించిన గీతా లు ఆకట్టుకున్నాయి. అధికారులు, యువతీ యువ కులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీవో హరికృష్ణ అన్నారు. తిలక్‌ స్టేడియం నుంచి బజార్‌ ఏరియా మీదుగా ఏఎంసీ క్రీడా మైదానం వరకు 5కేరన్‌ నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకురావ డానికి కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారందరు ఎన్నికల్లో ఓటు హక్కు విని యోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, ఓటు ద్వారా సమర్ధవంతమైన నాయ కున్ని ఎన్నుకోవచ్చన్నారు. ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు.

చెన్నూరు: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసు కోవాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ కోరారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా 5కే రన్‌ను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అ ర్హులైన అందరు బాధ్యతాయుతంగా ఓటు హ క్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థు లు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:01 PM