Share News

ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 03 , 2024 | 11:02 PM

పార్లమెంట్‌ ఎన్నిక ల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏసీపీ రవికు మార్‌ సూచించారు. శుక్రవారం సాయం త్రం పట్టణంలో పోలీసులు, కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలి

బెల్లంపల్లి, మే 3: పార్లమెంట్‌ ఎన్నిక ల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏసీపీ రవికు మార్‌ సూచించారు. శుక్రవారం సాయం త్రం పట్టణంలో పోలీసులు, కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకో వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రజలందరు పోలీసు లకు సహకరించాలన్నారు. శాంతిభద్రత లకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేష్‌మిశ్రా, రూరల్‌ సీఐ అప్జలొద్దీన్‌, ఎస్‌ఐలు రమేష్‌, డి. రమేష్‌, నరేష్‌, కేంద్ర బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.

దండేపల్లి: ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభధ్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్‌ అన్నారు. మండల కేంద్రంలో కేంద్ర సాయుధ బలగాలతో బస్టాండ్‌ నుంచి హైస్కూల్‌ వరకు కవాతు నిర్వ హించారు. సీఐ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరు స్వేచ్ఛా యుత వాతావరణంలో ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవా లన్నారు. ఓటు వినియోగించుకునేందుకు భరోసాగా ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తు న్నట్లు పేర్కోన్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడద్దని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహక రించాలన్నారు. దండేపల్లి, లక్షెటిపేట ఎస్సైలు లింగంపల్లి భూమేష్‌, పెట్టెం చంద్రర్‌కుమార్‌, పోలీసు, సాయుధ బలగాలు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:02 PM