Share News

ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:53 PM

మండలంలోని అన్ని గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీ లకు పనులు కల్పించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.

ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలి

భీమిని, జూన్‌ 6: మండలంలోని అన్ని గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీ లకు పనులు కల్పించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఉపాధిహామీ పథకం పనుల గురించి తెలుసుకున్నారు. రోజు ఎంత మంది కూలీలు పనిచేస్తు న్నారని, ఎంత కూలీ ఇస్తున్నారని సరైన సమయంలో వేతనాలు ఇస్తున్నా రా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూలీలకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.300 కూలీ డబ్బులు వచ్చేలా పనులు కల్పించాలన్నారు. ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో భాస్కర్‌రావు, ఈసీ సత్యనారాయణ, జూనియర్‌ అసిస్టెంట్‌ లలిత, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 10:53 PM