Share News

ఉపాధిహామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - May 23 , 2024 | 10:26 PM

ఉపాధిహామీ పనులు సక్ర మంగా నిర్వహించాలని గ్రామీణ ఉపాధిహామీ స్పె షల్‌ కమిషనర్‌ షఫియుల్లా అన్నారు. గురువారం బావురావుపేటలో జరుగుతున్న ఉపాధిహామీ పను లను పరిశీలించి కూలీలతో మాట్లాడారు.

ఉపాధిహామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

చెన్నూరు, మే 23: ఉపాధిహామీ పనులు సక్ర మంగా నిర్వహించాలని గ్రామీణ ఉపాధిహామీ స్పె షల్‌ కమిషనర్‌ షఫియుల్లా అన్నారు. గురువారం బావురావుపేటలో జరుగుతున్న ఉపాధిహామీ పను లను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. కూలీలకు రోజు రూ.300, వంద రోజులు పనులు కల్పిస్తు న్నామన్నారు. కూలీలకు నీడ, నీరు, మెడికల్‌ కిట్‌లు అందుబాటులో ఉంచాలని కార్యదర్శిని ఆదే శించారు. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో రెండు కిలోమీటర్లు సీసీ రోడ్డు అనుమతి తీసుకుని వేయా లని ఎంపీడీవోను ఆదేశించారు. నర్సరీని పరిశీలిం చి ప్రతీ ఇంటికి మొక్కలను అందజేయాలని సూ చించారు. అడిషనల్‌ డీఆర్‌డీవో దత్తరావు, ఎంపీడీ వో మోహన్‌, ఏపీవో గంగాభవాణీ ఉన్నారు.

భీమారం: చెరువు మట్టి పొలాలకు తరలించడం యోగ్యమైనదని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ స్పెషల్‌ కమిషనర్‌ షఫియుల్లా పేర్కొ న్నారు. కొత్త చెరువు వద్ద ఉపాధి పనులు, నర్సరీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీసిన మట్టిని పొలాల్లో రైతులు వినియో గిస్తే భూమి సారవంతంగా తయారవుతుంద న్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం 10 గంటలలోగా కూలీలు పనులను పూర్తి చేసు కోవాలని సూచించారు. ఈజీఎస్‌ పనులు సక్ర మంగా నిర్వహించేందుకు కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది కృషి చేయాలని, రికార్డుల్లో ఎలాంటి పొర పాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. కొందరు కూలీలు తమకు సక్రమంగా డబ్బులు రావడం లేదని తెలియజేయడంతో వెంటనే చెల్లించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో రాధోడ్‌ రాధ, డీఆర్‌డీవో కిషన్‌, డీపీవో వెంకటేశ్వ ర్‌లు, అడిషనల్‌ డీఆర్‌డీవో దత్తరాం, డీఎల్‌పీవో ధర్మరాణి, ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి శ్రీని వాస్‌, ఏపీవో జీనత్‌ బేగం, టీఏ శ్రీనివాస్‌,ఎఫ్‌ఏ బన్సలాల్‌ పాల్గొన్నారు.

సెగ్రిగేషన్‌ షెడ్లను వినియోగంలోకి తేవాలి

జైపూర్‌: గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్‌ షెడ్‌లను వినియోగంలోకి తేవాలని రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ షఫియుల్లా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సెగ్రిగేషన్‌ షెడ్‌ లను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కం పోస్టు పిట్‌లో వానపాములు ఉండేలా చూడాలని సూచించారు. కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియ ను నిరంతరం కొనసాగించాలని, ఎరువును మొక్క లకు వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వ హిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్లాస్టిక్‌, చెత్తాచెదారం రోడ్లపై లేకుండా చూడాలన్నారు. అడిషనల్‌ డీఆర్‌డీవో భుజంగరావు, డీపీవో వెంకటే శ్వర్‌రావు, ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శి ఉదయ్‌లు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 10:26 PM