Share News

క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:35 PM

ధరణిలో నమో దైన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించేందుకు ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 1: ధరణిలో నమో దైన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించేందుకు ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణిలో నమోదైన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 9వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తా మని, మండల అధికారులు తమ పరిధిలో నమో దైన భూ సంబందిత దరఖాస్తులు, ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించేం దుకు కృషి చేయాలన్నారు. ఆర్డీవో పరిధిలో పాస్‌ పుస్తకం లేకుండా నాలా దరఖాస్తు, భూముల సం బంధిత ఫిర్యాదులు, ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌, సంస్థల కోసం పట్టాదారు పాసు పుస్తకం, కోర్టు కేసుల సమాచారం, పట్టాదారు పాసు పుస్తకంలో ఖాతా, పేరు మిస్సింగ్‌, సర్వే నెంబరు, భూ రకం, విస్తీర్ణం భూవినియోగం ఇతరత్రా వివరాల సవరణ అంశా లు ఉంటాయని తెలిపారు. తహసీల్దార్‌ పరిధిలో అసైన్డ్‌ భూముల వారసత్వం, జీపీఏ, ఎస్‌పీఏ దర ఖాస్తులు, ఆధార్‌ వివరాలు సక్రమంగా లేని నిర్ధిష్ట భూ విషయాలపై దరఖాస్తు, ఖాతా కలిపే అం శాలు ఉంటాయని తెలిపారు. న్యాయస్ధానం తీర్పు ద్వారా పట్టాదారు పాసు పుస్తకం జారీ, నిషేధిత భూముల ఫిర్యాదులు, సెమీ అర్బన్‌ ప్రాంతంలో పట్టాదారు పాసు పుస్తకం దరఖాస్తు, నివాస స్థలా లుగా చూపిన ప్రాంతాల్లో పాసు పుస్తకం, మ్యుటే షన్‌ దరఖాస్తు, పట్టాదారు పాసు పుస్తకం లేకుం డా, అసైన్డ్‌ భూముల వారసత్వం దరఖాస్తు సంబంఽ దిత అంశాలపై కలెక్టర్‌ తుది ఆమోదం ఉంటుం దని తెలిపారు. దరఖాస్తులను నిర్ణీత సమయం లోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వేమనపల్లి: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్‌ రమేష్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మండలం లో మొత్తం 89 మంది రైతులకు చెందిన ధరణి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పరిష్కరిస్తా మన్నారు. శుక్రవారం 8 పట్టాదారు పాసుపుస్త కాల సవరణ, ఒక విరాసత్‌ సమస్యను పరిష్క రించినట్లు తెలిపారు. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీ ల్దార్‌ రెండు బృందాలుగా ఏర్పడి మండలంలో పర్యటించి పెండింగ్‌ సమస్యలను పరిష్కరిం చనున్నట్లు పేర్కొన్నారు.

భీమారం: ధరణి పెండింగ్‌ సమస్యలపై తహసీ ల్దార్‌ సదానందం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ వరకు ధరణి పెండింగ్‌ సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీన్ని విజయవంతం చేయా లని కోరారు. నాయబ్‌ తహసీల్దార్‌ కృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్‌ స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 10:35 PM