Share News

బీజేపీతోనే పేద ప్రజల ఆర్థికాభివృద్ధి

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:47 PM

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే పేద ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందుతారని పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్‌లు అన్నారు. సోమవారం గూడెం, రాసపల్లి, నంబాల గ్రామాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్‌, పార్టీ శ్రేణు లతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు.

బీజేపీతోనే పేద ప్రజల ఆర్థికాభివృద్ధి

దండేపల్లి, ఏప్రిల్‌ 8: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే పేద ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందుతారని పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్‌లు అన్నారు. సోమవారం గూడెం, రాసపల్లి, నంబాల గ్రామాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్‌, పార్టీ శ్రేణు లతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. వారు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో గోమాస శ్రీని వాస్‌ను గెలిపించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ ప్రభుత్వం రావాలన్నారు పార్టీ మండల అధ్యక్ష కార్య దర్శులు రాజయ్య,, సురేందర్‌, శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ గురువయ్య, గూడెం పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సురేష్‌, నాయకులు కిషన్‌, ప్రభాకర్‌, హరికృష్ణ, రవిగౌడ్‌, గిరిధర్‌, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, గంగన్న, సత్యం, తులసి, మహేష్‌, లక్ష్మినారాయణ, పాల్గొన్నారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో సోమవారం బీజేపీ నాయకులు, ప్రో నమో టీం సభ్యులు ప్రచా రం నిర్వహించారు. పట్టణాధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఫిర్‌ ఏక్‌ భార్‌ మోదీ సర్కార్‌ నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిం చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులు పులుగం తిరుపతి, బాపు, సంతోష్‌కుమా ర్‌, రాజులాల్‌ యాదవ్‌, రాంచందర్‌, యుగందర్‌, సుమ, స్రవంతి, వెంకటేష్‌, స్వామి, రాములు, సతీష్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 10:47 PM