Share News

సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:28 PM

సంఘ విద్రోహ శక్తులకు సహకరించి యువత భవిష్యత్‌ను నాశనం చేసుకో వద్దని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివా సులు అన్నారు. గురువారం వెంచపల్లి ఫెర్రీ పా యింట్‌ను డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌తో కలిసి సం దర్శించారు.

సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు

కోటపల్లి, ఫిబ్రవరి 29: సంఘ విద్రోహ శక్తులకు సహకరించి యువత భవిష్యత్‌ను నాశనం చేసుకో వద్దని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివా సులు అన్నారు. గురువారం వెంచపల్లి ఫెర్రీ పా యింట్‌ను డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌తో కలిసి సం దర్శించారు. పడవలు నడిపే, చేపలు పట్టే వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలు, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశా రు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, యువత బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాల న్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత మైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఉంటుందని, డ్రోన్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇం దుకు తమ అండ ఉంటుందన్నారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్‌ సీఐ సుధాకర్‌, కోటపల్లి, నీల్వాయి, చెన్నూరు ఎస్‌ఐలు రాజేందర్‌, సుబ్బారావు, రవీందర్‌ పాల్గొన్నారు.

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

వేమనపల్లి: పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేం దుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రామ గుండం సీపీ శ్రీనివాసులు సూచించారు. నీల్వాయి పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌తో కలిసి సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గుత్తేదారుతో మా ట్లాడి త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. అనంతరం సీపీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్సించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంద న్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ఫిర్యాదుదారు ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల వివరాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ప్రాణహిత నది లో పడవలు నడిపే వారి వివరాలను సేకరించారు. మావో యిస్టు సానుభూతిపరులు, మిలి టెంట్లు, మావోయిస్టులకు సం బంధించిన వారి కదలికలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకు న్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు కృషి చేయాలన్నారు. చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి ఎస్‌ఐలు రవీందర్‌, సుబ్బారావు, మహేందర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 10:28 PM