Share News

జీలుగ విత్తనాలు పంపిణీ

ABN , Publish Date - May 30 , 2024 | 10:33 PM

పట్టణంలోని పాత బస్టాండ్‌లోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో మండల పరిధిలోని రైతులకు గురువారం జిల్లా వ్యవసాయాధికారి సురేఖ జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు.

జీలుగ విత్తనాలు పంపిణీ

మందమర్రిటౌన్‌, మే 30: పట్టణంలోని పాత బస్టాండ్‌లోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో మండల పరిధిలోని రైతులకు గురువారం జిల్లా వ్యవసాయాధికారి సురేఖ జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ మండలానికి వంద జీలుగ బస్తాలు వచ్చాయని, ఒక బస్తా 30 కిలోలు ఉంటుందని, రెండున్నర ఎకరాలకు సరిపోతుంద న్నారు. ధర రూ.1116 ఉంటుందని తెలిపారు. పచ్చి రొట్ట వాడకం ద్వారా భూసారం పెరగడమే కాకుండా నేలలో సూక్ష్మ జీవుల అభివృద్ధి జరిగి నేల గుల్లబారి పంటకు బలమైన వేరు వ్యవస్థ ఏర్పడి అధిక దిగుబ డులు వస్తాయని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సుధారాణి, ఆగ్రోస్‌ సేవా కేంద్రం యాజమాని సంగ వెంకటేష్‌, రైతులు పాల్గొన్నారు.

కాసిపేట: మండలంలోని రైతులకు రాయితీపై జీలుగ విత్తనాలు అం దజేస్తున్నామని మండల వ్యవసాయాధికారి వందన తెలిపారు. గురువా రం ధర్మారావుపేట పీఎసీఎస్‌ కాసిపేట కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ 30 కిలోల జీలుగ విత్త నాల బ్యాగు ధర రూ.2790 ఉండగా ప్రభుత్వం రాయితీపై రూ. 1116కు అందిస్తుందన్నారు. రైతులు విత్తనాలను తీసుకువెళ్లాలని సూచించారు. ఏఈవో రమ్య, పీఏసీఎస్‌ సీఈవో రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 10:33 PM