Share News

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:07 PM

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్‌ ఎస్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌చైర్మన్‌ సాగర్‌రెడ్డిలపై సొంత పార్టీకే చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ ఇటీవల కలెక్టర్‌కు నోటీసు అందజేశారు.

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి 6: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్‌ ఎస్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌చైర్మన్‌ సాగర్‌రెడ్డిలపై సొంత పార్టీకే చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ ఇటీవల కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. దీంతో మంచిర్యాల ఆర్డీవో రాములు ప్రత్యేక అధికారి హోదాలో మంగళవారం అవిశ్వా సం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా తొలు త 17 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేయగా ఇటీవల ఏడుగురు కౌన్సి లర్లు కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ సభ్యు లు ఇద్దరు ఉండగా కొత్తగా చేరిన వారితో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 9కి చేరగా, బీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది ఉన్నారు. కాగా ప్రత్యేక సమావేశానికి 13 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు హాజరు కాగా కాంగ్రెస్‌ సభ్యులు హాజరు కాలేదు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు కోరం ఉండాల్సి ఉంది. ఈ లెక్కన సమావేశానికి 15 మంది కౌన్సిలర్లు హాజరై బలం నిరూపించుకోవాల్సి ఉండగా కేవలం బీఆర్‌ఎస్‌కు చెందిన 13 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రత్యేకాధికారి రెండు సార్లు సమయం ఇచ్చినప్పటికీ గడువు ముగిసే సమయానికి కౌన్సిలర్లు హాజరు కాక పోవడంతో కోరం లేక అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. కాగా చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన 13 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రకటించిన వారే స్వలాభం కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్నారు. సజావుగా సాగుతున్న క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలికి నమ్మించి మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం కోరం లేక వీగిపోవడంతో కాం గ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌లతోపాటు 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌చైర్మన్‌ సాగర్‌రెడ్డిలు మాట్లాడుతూ క్యాతన్‌పల్లి అభివృద్ధి కాంగ్రెస్‌ ద్వారానే జరుగుతుందని, బీఆర్‌ఎస్‌ పార్టీ అవలంభిస్తున్న ఒంటెద్దుపోకడల కార ణంగానే కాంగ్రెస్‌లోకి చేరామని, మున్సిపల్‌ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్య మవుతుందని పేర్కొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 10:07 PM