Share News

బీజేపీ అభ్యర్థి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:06 PM

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందని పార్టీ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్‌ అన్నారు. శనివారం గోపాలవాడ, హమాలీవాడ, అశోక్‌ రోడ్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

బీజేపీ అభ్యర్థి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

ఏసీసీ, ఏప్రిల్‌ 13: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందని పార్టీ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్‌ అన్నారు. శనివారం గోపాలవాడ, హమాలీవాడ, అశోక్‌ రోడ్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పదేళ్ళ పాలనలో అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. పేద ప్రజలకు ఉచిత బియ్యం, వీధి వ్యాపారులకు పీఎం సమ్మాన్‌ నిధి రుణాలు, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం ఆవాస్‌ యోజన ద్వారా పేదలకు ఇండ్లు, ఉచిత కరోనా టీకాల వంటి అనేక పథకాలను అమలు చేశారన్నారు. కేంద్రం నిధులతోనే రోడ్లు, శ్మశాన వాటికలు, రహదారులు, డంపింగ్‌యార్డులు నిర్మాణమవుతున్నాయన్నారు. మంచిర్యాలలో జాతీయ రహదారులు, రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభించారన్నారు. జైన్‌, పురుషోత్తం, హరికృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీ ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. శనివారం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వినోద్‌ను గెలిపిస్తే హైద్రాబాద్‌కే పరిమితం అవుతున్నాడని, వంశీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండడన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. పలువురు పార్టీలో చేరగా కం డువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు సుదర్శన్‌గౌడ్‌, రజనీష్‌ జైన్‌, వెంకటకృస్ణ, అశోక్‌, సంతోష్‌కుమార్‌, శ్రీకృష్ణదేవరాయలు, పురుషోత్తం, సుధీర్‌గౌడ్‌, విజయ్‌, మహీదర్‌గౌడ్‌, కమల, రజిని, పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: బీజేపీకి అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులతో కలిసి విలేకరుల సమావే శంలో మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, వీటిని ప్రజలు నమ్మరన్నారు. వివేక్‌ వెం కటస్వామి కుటుంబ సభ్యుల కుల ధ్రువీకరణ పత్రాలను ప్రజల ముందు ఉంచాలని, కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే దళిత కార్డు వాడుతున్నార న్నారు. ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు పోటీ చేయడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారన్నారు. ఈ నెల 15న జరిగే సభకు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని తెలిపారు. ప్రజలం దరు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఏమాజీ, రామయ్య, ఎల్లయ్య, సమ్మయ్య, శరత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 10:06 PM