Share News

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:31 PM

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైం దని పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు.

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

వేమనపల్లి, ఏప్రిల్‌14: రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైం దని పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి బీఆర్‌ఎస్‌ విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. పెద్దప ల్లి ఎంపీగా తనను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, ఎంపీపీ కోలి స్వర్ణలత, వైస్‌ ఎంపీపీ ఆత్రం గణపతి, మధుకర్‌, బాపు, మొండి, వెంకటేశం, మధుకర్‌, పాల్గొన్నారు.

కన్నెపల్లి: బీఆర్‌ఎస్‌తోనే ప్రజల సంక్షేమం సాధ్య మవుతుందని పెద్లపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్య ర్ధి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు అధైర్య పడవద్దని, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జెడ్పీ టీసీ సత్యనారాయణ, మాజీ సర్పంచు పుల్లూరి రాజ య్య, శ్రీరామరావు, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 10:31 PM