హరీష్‌రావు అనుచిత వ్యాఖ్యలపై ఖండన
ABN , Publish Date - Mar 08 , 2024 | 10:19 PM
ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా శాఖ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌర స్తాలో హరీష్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు.
ఏసీసీ, మార్చి 8: ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా శాఖ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌర స్తాలో హరీష్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూంలలో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించిందని గురు వారం హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తు న్నామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వ లేదని, డీఏ, పీఆర్‌సీ బకాయిలు, మెడికల్ బిల్లులు పూర్తిగా చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 1వ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడాన్ని ఓర్వలేక హరీష్‌రావు ఇలాం టి వ్యాఖ్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహ రించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం హరీష్‌రావు దిష్టిబొమ్మను దహ నం చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధరణికోట వేణుగోపాల్,సూరినేని గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, లక్ష్మీనారాయణరావు, సుధీ ర్, రాజేశ్వర్‌రావు, సాగర్ పాల్గొన్నారు. టీఎస్‌యూ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్ర పాణి, రాజవేణులు హరీష్‌రావు వ్యాఖ్యలు సరికాద ని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రైతులకు తాము వ్యతిరేకం కాద ని, రైతులకు, ఉద్యోగులకు సంబంధం ఏమిటో హరీష్‌రావు చెప్పాలన్నారు.