Share News

అదనపు బ్యాలెట్‌ యూనిట్లర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - May 03 , 2024 | 11:03 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్‌ కోసం అదనపు బ్యాలెట్‌ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ర్యాండమై జేషన్‌ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌ పేర్కొన్నారు.

అదనపు బ్యాలెట్‌ యూనిట్లర్యాండమైజేషన్‌ పూర్తి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 3: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్‌ కోసం అదనపు బ్యాలెట్‌ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ర్యాండమై జేషన్‌ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి మంచిర్యాల, చెన్నూరు రిటర్నిం గ్‌ అధికారులు రాములు, చంద్రకళ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో 42 మంది అభ్యర్ధులు పోటీల్లో ఉండడంతో అదనపు బ్యాలెట్‌ యూని ట్లు అవసరం ఉన్నందున ఈసీఐల్‌ కంపెనీ నుం చి జిల్లాకు చేరుకున్న 1800, అదనపు బ్యాలెట్‌ యూనిట్లతోపాటు పాతవి 88లో 12 యంత్రాలతో సమస్య ఉన్నందున మిగిలిన 76 ఈవీ ఎంలను కలుపుకుని ర్యాండమైజేషన్‌ చేశామని తెలిపారు.

చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు 575 చొప్పున, మంచిర్యాల నియోజకవర్గానికి 726 కేటాయించామన్నారు. ఆయా సెగ్మెంట్లకు కేటాయించిన ప్రకారంగా బందోబస్తు ఏర్పాట్ల మధ్య తరలించి స్ర్టాంగ్‌ రూంలలో భద్రపర్చి 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి స్ర్టాంగ్‌రూంలను తరలించి భద్రపరిచే ప్రతి కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం ఉంటుందని తెలిపారు. అనంతరం డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా జరిగేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. పోలింగ్‌ కోసం 741 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించామ న్నారు.ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, అధికారులు, పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసి లిటేషన్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 13న పోలింగ్‌ జరుగుతుందని, అత్యవసర సేవలు అందిస్తున్న వారు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇందుకోసం ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రా లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 8 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:03 PM