నస్పూర్ మున్సిపాలిటీలో కమిషనర్ ఇష్టారాజ్యం
ABN , Publish Date - Feb 17 , 2024 | 10:28 PM
ఆయన నస్పూర్ మున్సిపల్ కమిషనర్. ఆనారోగ్య కారణం గా ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు మెడికల్ లీవు పెట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా 14వ తేదీన రిలీవ్ అయి 15న చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఆయన 14వ తేదీన తొమ్మిది ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేశారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆయన నస్పూర్ మున్సిపల్ కమిషనర్. ఆనారోగ్య కారణం గా ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు మెడికల్ లీవు పెట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా 14వ తేదీన రిలీవ్ అయి 15న చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఆయన 14వ తేదీన తొమ్మిది ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఆ రోజున మెడికల్ లీవులో ఉండి, హడావుడిగా విధుల్లో చేరడమేగాక, అదే రోజు రిలీవ్ కూడా అయ్యారు. అయినా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
అసైన్డ్ భూమిలో నిర్మాణ అనుమతులు
అధికారులు బదిలీ అయినప్పుడు పెండింగు పనులు హడావుడిగా పూర్తి చేయడం అక్కడక్కడ జరుగుతూనే ఉంటుంది. అయితే విధుల్లో నుంచి రిలీవ్ అయిన అధికారి నిర్మాణ అనుమతులు జారీ చేయడం సంచలనంగా మారింది. అదికూడా ఓ అసైన్డ్ భూమిలో కొనుగోలు చేసిన ప్లాటుకు సదరు కమిషనర్ ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధి లోని సర్వే నెంబరు 42లో అసైన్డ్ భూమి ఉంది. అందులో అక్రమంగా కొందరు ప్లాట్లు విక్రయిం చారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఎలాంటి నిర్మా ణాలు చేపట్టరాదనే నిబంధనలున్నాయి. అయినా అసైన్డ్ భూమిలో కొనుగోలు చేసిన ప్లాటుకు కమి షనర్ అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌కు పంపగా హైద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన జి లలిత, జి శ్రీనివాస్ పేరిట ప్లాట్ నెంబర్ 126లోని 146.31 చదరపు గజాలకు ఆర్డర్ నెంబర్ 364103/ ఎన్‌ఏఎస్‌పీ/0027/2024 ద్వారా రెండంతస్థులకు అనుమతులు మంజూరయ్యాయి.
కమీషన్ల కోసం కక్కుర్తి
మున్సిపాలిటీలో ఒకే రోజు అర్థరాత్రి ఏకంగా తొమ్మిది నిర్మాణాలకు అనుమతులు జారీ కావడం గమనార్హం. ఈ తతంగం వెనుక లక్షల రూపాయ లు చేతులు మారినట్లు తెలుస్తోంది. మెడికల్ లీవు లో ఉన్న అధికారికి బదిలీ అయిన స్థానంలో వెం టనే చేరాలని ఈ నెల 13న ఆదేశాలు జారీ అయ్యా యి. దీంతో 14న ఉదయం విధుల్లో చేరిన ఆయన తిరిగి మధ్యాహ్నం రిలీవ్ అయ్యారు. అయినా ఇళ్ల అనుమతులు జారీ చేశారు. అదికూడా కార్యాలయ సమయం ముగిసిన తరువాత అనుమతులు ఇవ్వ డం కొసమెరుపు. నిబంధనలు తుంగలో తొక్కడమే గాకుండా అసైన్డ్‌లోని ప్లాటుకు కూడా అనుమతులు జారీ చేయడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
తక్షణ చర్యలు చేపట్టాలి....
నయీంపాషా, అమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు
మెడికల్ లీవులో ఉండి, మరో చోటికి బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ అక్ర మంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేసినం దున ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికా రులు పూర్తిసాయిలో విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి.