Share News

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:17 PM

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లను వేయించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఆయన సందర్శించారు.

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి

హాజీపూర్‌, మార్చి 22: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లను వేయించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62 ఆవు జాతి, 155 గేదె జాతి పశువులకు టీకాలు వేయించామన్నారు. పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పశువులను ఎండ బారి నుంచి కాపాడుకోవాలని, స్వచ్ఛమైన తాగునీరు, మేత అందించాలని సూచించారు. పశువైద్యాధికారులు శాంతి రేఖ, సరిత, సిబ్బంది అగ్నివేశ్‌, స్వప్న, నారాయణ, సికిందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 10:18 PM