కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:59 PM
ప్రభుత్వ రంగ సంస్థలు, ఖనిజ సంపదను అన్నింటిని కార్పొరేట్, పెట్టుబడిదారులకు అమ్మివేయలన్నా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.

నస్పూర్, జూలై 5: ప్రభుత్వ రంగ సంస్థలు, ఖనిజ సంపదను అన్నింటిని కార్పొరేట్, పెట్టుబడిదారులకు అమ్మివేయలన్నా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవోకు అందజేశారు. బొగ్గు గనులను వేలం వేయ కుండా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి, సీఐటీయు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్, నాయకులు ప్రకాష్, నగేష్, మధు, ఉమారాణి, సమ్మక్క, రామస్వామి, చంద్రశేఖర్, బాలాజీ, శ్రీనివాస్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.