Share News

బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:08 PM

బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖలతో కలిసి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు

ఏసీసీ, ఏప్రిల్‌ 26 : బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖలతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శనివారం మంచిర్యాల, నస్పూర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చౌదరి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు హాజరవుతార న్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాం గ్రెస్‌ పార్టీ నెరవేర్చడానికి కృత నిశ్చయంతో ఉంద న్నారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత కరెం టు, ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పెంపు, రైతు భరోసా అమలు చేశామన్నారు. మంచిర్యాల నియోజకవర్గం లో తాగునీటి సమస్యను పరిష్కరించి రోజు గంట సేపు అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం బ్యాక్‌ వాట ర్‌తో వరదలు వచ్చి ఇండ్లు మునిగితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఇండ్లలో పడుకున్నారని, కాంగ్రెస్‌ నాయ కులు ప్రజలకు సహాయం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాకు ప్రయోజనం శూన్యమన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు తరుగు పేరిట చేస్తున్న దోపిడిని అరికట్టానన్నారు. ఆగస్టులో వాన లు పడక కేసీఆర్‌ పాలనలోనే కరువు వస్తే డిసెం బరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఎలా కార ణం అవుతుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ 2014, 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. పట్టాదారు కాస్తుదారుల వివరా లను మళ్లీ రికార్డు చేస్తున్నామని, ఇది పూర్తి కాగానే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. బీజేపీ రాముని జపం చేయడం తప్ప మరేమి లేదన్నారు. ప్రధాని మోదీ యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించి 10 ఏండ్లలో 7 కోట్ల ఉద్యోగాలు ఊడగొ ట్టారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కం పెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. బీజేపీ పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించే పార్టీ అని, అన్ని వర్గాలను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం హడ్కో రుణం 42 వేల కోట్లు మంజూరైందని, ఎన్నికల కోడ్‌ అయి పోగానే పనులను ప్రారంభిస్తామన్నారు. సింగరేణి నిధులు స్ధానికంగానే ఉపయోగిం చాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌లు ఇచ్చి కావాలని కోర్టు కేసులు వేయించి ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు. శనివారం నిర్వహిం చే కాంగ్రెస్‌ ఆశీర్వాద సభలో ప్రజ లు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. నస్పూర్‌ మాజీ సర్పంచు గోపన్న, తదితరులు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్‌, చిట్ల సత్యనారాయణ, సుర్మిళ్ల వేణు, సల్ల మహేష్‌, సుధాకర్‌, చంద్రశేఖర్‌, శ్రీనివాసరామ్‌, రవికుమార్‌, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

జిల్లా కేంద్రం, నస్పూర్‌లో శనివారం నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు శుక్ర వారం పరిశీలించారు.

Updated Date - Apr 26 , 2024 | 10:08 PM