Share News

గాంధారిఖిల్లాకు పర్యాటక గుర్తింపు తీసుకువస్తా

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:36 PM

గాంధారి ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని చెన్నూ రు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం గాంధారి ఖిల్లా జాతర ప్రజాదర్భార్‌ కార్యక్రమంలో భాగంగా నాయక్‌పోడ్‌, గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు.

గాంధారిఖిల్లాకు పర్యాటక గుర్తింపు తీసుకువస్తా

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి 25: గాంధారి ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని చెన్నూ రు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం గాంధారి ఖిల్లా జాతర ప్రజాదర్భార్‌ కార్యక్రమంలో భాగంగా నాయక్‌పోడ్‌, గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ఒడ్డెర, సామంత రాజులు పాలించిన ప్రాంతమైన బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంద న్నారు. నాయక్‌పోడ్‌, గిరిజనుల ఆరాధ్య దైవమైన గాంధారి మైసమ్మను రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారని, ఈ ప్రాంతం ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంతోపాటు జాతరకు పూర్తి వసతులను ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. ఆదివాసుల కోరిన కోరికలు తీర్చే దేవతగా భావిస్తారని అన్నారు. జాత రకు తరలివచ్చే భక్తులకు విద్యుత్‌, రోడ్లు, మంచి నీటి సౌకర్యం, భక్తుల సహాయార్థం షెడ్లు నిర్మించ డానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాతర కోసం రూ.5 లక్షలు మంజూరు చేయించినట్లు పేర్కొ న్నారు. వచ్చే సంవత్సరం జాతర లోపు అన్ని సౌక ర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వివేక్‌ను నాయక్‌పోడ్‌లు సన్మానించారు. క్యాతన్‌ప ల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌ చైర్మన్‌ ఎర్రం విద్యాసాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆదివాసి నాయక్‌ పోడ్‌ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్‌, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, ఆలయ కమిటీ వైస్‌ చైర్మన్‌ దయనేని రమేష్‌, కమిటీ సభ్యులు రాజశే ఖర్‌, అనిల్‌, మారుపాక రాజయ్య పాల్గొన్నారు.

నాయకుల పూజలు

మందమర్రి టౌన్‌: గాంధారి మైసమ్మ జాతరకు మందమర్రికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. భీమన్న దేవుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మందమర్రికి చెందిన నాయకులు సొత్కు సుదర్శన్‌, బండి సదా నందం యాదవ్‌, మంద తిరుమల్‌, ఎండి ఇసాక్‌, పోలు శ్రీనివాస్‌, ఇస్సాక్‌, జావేద్‌ఖాన్‌, కడాల శ్రీనివాస్‌, జమాల్పురి నర్సోజితో పాటు కడారి జీవన్‌ పాల్గొన్నారు. ఆదివారం కావడంతో కార్మిక కుటుం బాలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి మొక్కులు చెల్లిం చుకున్నారు. ఖిల్లా ప్రాంతమంతా కూడా భక్తులతో జనసంద్రంగా మారింది.

Updated Date - Feb 25 , 2024 | 10:36 PM